Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఇంత‌కీ ఈ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న దేనికోసం?

By:  Tupaki Desk   |   19 Feb 2022 2:30 AM GMT
పుష్ప 2 ఇంత‌కీ ఈ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న దేనికోసం?
X
పుష్ప- ది రైజ్ తో పాన్ ఇండియా స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అతని ఎత్తుగ‌డ బాలీవుడ్ లోనూ ఫ‌లించింది. ఆరంగేట్ర చిత్రంతోనే అత‌డు ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌లోనూ బంప‌ర్ హిట్ కొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ నుండి ఈ చిత్రం రూ.100 కోట్ల నికర వసూళ్లను సాధించడంతో పుష్ప టీమ్ పడిన కష్టమంతా ఫలించింది.

నిజానికి ఈ ఫ‌లింతం తెలుగు రాష్ట్రాల‌ను మించి అనిపించింది. OTTలోనూ పుష్ప- 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తద్వారా అల్లు అర్జున్.. అతని దర్శకుడు సుకుమార్ వెంటనే పార్ట్-2 పై దృష్టి పెట్టారు. ఏప్రిల్ లో మూవీని ప్రారంభిస్తామ‌ని కూడా ఇప్ప‌టికే చెప్పారు.

తాజా స‌మాచారం మేర‌కు.. ఇప్ప‌టికే పుష్ప 2 ప్రీప్రొడ‌క్ష‌న్ వేగంగా పూర్త‌వుతోంది. దర్శకుడు సుకుమార్ స‌హా ప్రధాన సాంకేతిక నిపుణులు.. టీమ్ లోని నటీనటులతో పాటు అల్లు అర్జున్ మీటింగ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఈ స‌మావేశంలో చాలా అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. తొలిగా బ‌న్ని తాము అందుకున్న‌ ఫలితంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి సినిమా పార్ట్ 2 ని తెర‌పైకి తేగ‌ల‌మా? అన్న త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగింది. దీని గురించి సుక్కూని బ‌న్ని ప‌దే ప‌దే ప్ర‌శ్నించార‌ట‌.

మార్చి లోనే సినిమాని ప్రారంభించి కేవ‌లం 4 నెలల వ్యవధిలో మొత్తం షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయగలరా? అని అల్లు అర్జున్ సుకుమార్ ని ప్ర‌శ్నించార‌ట‌. కానీ సుకుమార్ ప‌నితీరు కాస్త నెమ్మ‌దిగా ఉంటుంది. సాలిడ్ ఔట్ పుట్ కోసం అత‌డు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన‌దే.

ఇక‌పోతే మొదటి భాగం సాధించిన గ్రాండ్ స‌క్సెస్ నేప‌థ్యంలో అంత‌కుమించి రెండవ భాగాన్ని పెద్ద స‌క్సెస్ చేయ‌డానికి వారు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో సినిమాను బాగా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది.

అలాగే పుష్ప 2 కోసం బ‌న్ని ఫోటోషూట్ కి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. ఈ శ‌నివారం నాడే ఫోటోషూట్ పై ప్లాన్ చేసార‌ట‌. ఇక ఈ పార్ట్ 2లోనూ బ‌న్నీతో పాటు ఫ‌హ‌ద్ ఫాజిల్.. అన‌సూయ .. ర‌ష్మిక మంద‌న త‌దిత‌రులు న‌టించ‌నున్నారు.