Begin typing your search above and press return to search.

పుష్ప 2.. అప్పుడే ఓ పనైపోయింది!

By:  Tupaki Desk   |   23 Aug 2022 12:30 AM GMT
పుష్ప 2.. అప్పుడే ఓ పనైపోయింది!
X
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో రాబోయే పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు రోజురోజుకు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా అయితే విడుదల అయ్యింది లేదు. ఇక సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ ఏ విధంగా కనిపిస్తాడు అలాగే ఆ సినిమా ఇంకా ఎలా ఉండబోతోంది అనే విషయాలు ప్రేక్షకులను ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

పుష్ప పార్ట్ 1 భారీ స్థాయిలో విజయం సాధించడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ మేకింగ్ విషయంలో చిత్ర యూనిట్ పై తీవ్ర ఒత్తిడి అయితే పెరిగింది. ఇక దర్శకుడు సుకుమార్ అయితే ఆ ఒత్తిడిని జయించే విధంగా బలమైన స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైన తర్వాతనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు.

ఇక రీసెంట్ గా ఆ పనులు పూర్తిగా కావడంతో నేడు పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేసి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు.

అయితే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాతో మరోసారి తన బలాన్ని చూపించాలని అనుకుంటున్నాడు. యూరప్ లో ఇటీవల దర్శకుడు సుకుమార్ అలాగే పాటల రచయిత చంద్రబోస్ ముగ్గురు కూడా ప్రత్యేకంగా కూర్చునే కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా ఐటమ్ సాంగ్ అయితే దాదాపు లిరిక్స్ తో సహాసిద్ధమైనట్లు సమాచారం. దేవి అదిరిపోయే ట్యూన్స్ తో ఆకట్టుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1 లో ఊ అంటావా.. అనే ఐటెం సాంగ్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా ఉండాలి కాబట్టి దేవి గట్టిగానే ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక సమంత కంటే ఈసారి మరొక బాలీవుడ్ బ్యూటీని ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించే ఛాన్స్ ఉంది.

అంచనాలు పెరిగాయి కాబట్టి ఏ విషయంలో కూడా నిర్మాతలు తగ్గకూడదు అని అనుకుంటున్నారు. అసలైతే మొదటి పార్ట్ షూటింగ్ జరిగినప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించిన కొంత షూటింగ్ కూడా షూట్ చేశారు. కానీ ఇప్పుడు అంచనాలు పెరిగిపోవడం వలన మళ్లీ సెకండ్ పార్ట్ లో మొత్తాన్ని కూడా హైలెట్గా తెరపైకి తీసుకురావాలి అని కథలో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది. మరి ఈ మార్పులతో సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.