Begin typing your search above and press return to search.
`పుష్ప -2` స్టార్టింగ్‌కి ముహూర్తం పెట్టేశారు
By: Tupaki Desk | 6 Jan 2022 12:00 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప : ది రైజ్`. `పుష్ప` సీరిస్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఈ మూవీ సుకుమార్ కెరీర్‌లోనే అత్యధ్భుతాలని సృష్టిస్తోంది.
గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఊర మాస్ అంశాలని జోడించి బన్నీని మాస్ పాత్రలో ప్రజెంట్ చేసిన తీరు దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది వారిని కూడా ఆకట్టుకుంటోంది. విచిత్రం ఏంటంటే ఈ మూవీ దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో ఊహించని విధంగా వసూళ్ల సూనామీ సృష్టిస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. .
అయితే ఈ సినిమా సక్సెస్ విషయంలో అందరికంటే దర్శకుడు సుకుమార్ చాలా హ్యాపీగా వున్నట్టుగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ టైమ్ వరకు టెన్షన్ టెన్షన్ గా గడిపిన సుకుమార్ కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనూ హాజరు కాలేకపోయాడు. దీన్ని బట్టి ఆయన ఏ స్థాయిలో ఒత్తిడికి గురయ్యాడో స్పష్టమైంది. ఇక ఇంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా ఇతర భాషల్లో హిట్ అవుతుందా? అని సుకుమార్ కు ముందు నుంచి కాన్ఫిడెంట్ లేదంట. తెలుగు ఓకే కానీ మిగతా భాషల్లో అనుకున్న స్థాయిలో వర్కవుట్ అవుతుందా? అని అనుమానించారట.
చివరి నిమిషం వరకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో టెన్షన్ టెన్షన్ గా గడిపిన ఆయన తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకులు `పుష్ప`కు బ్రహ్మరథంపడుతుండటం చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇది కలా నిజమా అని సర్ప్రైజ్ అవుతున్నారట. దీంతో ఈ ఆనందాన్ని తన ఫ్రెండ్స్ , ఫ్యామిలీస్ తో షేర్ చేసుకుంటూ వరుస పార్టీల్లో మునిగితేలుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
పార్ట్ 1 ఊహించిన దానికి మించి సక్సెస్ కావడంతో రెట్టించిన ఆనందంతో వున్న సుకుమార్ పార్ట్ 2ని మరింత జోష్ గా తెరపైకి తీసుకురాబోతున్నారట. అంతకు మించి అన్న స్టైల్లో `పుష్ప ది రూల్`ని తెరకెక్కించడానికి అప్పుడే ప్లాన్ లు సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తరువాత నుంచి పార్ట్ ని ప్రారంభించాలని సుకుమార్ తన టీమ్ కి చెప్పినట్టు తెలిసింది. ఫస్ట్ పార్ట్ లో వున్న లోపాలని సవరిస్తూ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారట.
మార్పులు పూర్తయితే స్క్రిప్ట్ మార్చినాటికి పక్కాగా కంప్లీట్ అవుతుందని ఆ తరువాత షూటింగ్ ని రాకెట్ వేగంతో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అంతే కాకుండా పార్ట్ 2 విషయంలో బన్నీ కొన్ని కండీషన్స్ పెట్టారట. అవేంటంటే సినిమాని అక్టోబర్ కల్లా పూర్తి చేసి ఇదే ఏడాది ఎండింగ్ లో అంటే డిసెంబర్ లో రిలీజ్ చేయాలని దర్శకుడు సుకుమార్ కి చెప్పినట్టుగా ఇన్ సైడ్ టాక్. మరి బన్నీ కండీషన్స్ కి సుకుమార్ సై అంటారా లేక జనవరికే వచ్చేద్దామంటారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఉత్తరాదిలో `పుష్ప` ఇప్పటికే 68 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది. ఈ రేంజ్‌లో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా ఉత్తరాదిలో వసూలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మా వాళ్లకు చేతకాని రికార్డుల్ని మీ సినిమాలు సాధించేస్తున్నాయిని, ఈ విషయంలో మా స్టార్స్ వేస్ట్ అని కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో `పుష్ప` వసూళ్ల పరంగానూ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.
