Begin typing your search above and press return to search.
పుష్ప 2కు ఆ రాష్ట్రం లో రికార్డు డీల్
By: Tupaki Desk | 2 Jun 2023 10:59 AMతెలుగు సినిమా రేంజ్ కొంత కాలంగా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. దీనికి కారణం మన భాషలో రూపొంది పాన్ ఇండియా రేంజ్ లో విజయాల ను అందుకున్న చిత్రాలే అని చెప్పాలి. అలాంటి వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప ది రైజ్' ఒకటి. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి సత్తా చాటింది.
మొదటి భాగం సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో 'పుష్ప ది రూల్'పై అంచనాలు ఆకాశం అంత ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఫస్ట్ పార్ట్ కంటే హై రేంజ్‌లో రూపొందిస్తున్నారు. దీనికితోడు ఇటీవలే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ వీడియో అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకుంది. ఫలితంగా ఈ చిత్రం పై ఉన్న హైప్ ను మరింతగా పెంచుకుంటూ పోయింది.
సక్సెస్‌ఫుల్ మూవీ కి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప ది రూల్' షూటింగ్ జరుగుతుండగానే దీనికి సంబంధించిన పలు రకాల రైట్స్‌కు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ఇలా ఇప్పటికే కొన్ని నాన్ థియేట్రికల్, థియేట్రికల్ హక్కుల ను నిర్మాతలు అమ్మేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'పుష్ప 2' మూవీకి సంబంధించిన కర్నాటక ఏరియా రైట్స్ వ్యవహరం హాట్ టాపిక్ అవుతోంది.
'పుష్ప' మూవీ కర్నాటకలో భారీ వసూళ్ల ను సాధించింది. దీంతో ఇప్పుడు 'పుష్ప ది రూల్' రైట్స్‌కు అక్కడ పోటీ ఏర్పడింది. దీంతో నిర్మాతలు కర్నాటక రేటును రూ. 30 కోట్లుగా ఫిక్స్ చేసుకున్నారట. వీటి కోసం రెండు బడా సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. కానీ, ఈ రెండు సంస్థలూ రూ. 20 కోట్లు వరకూ పెట్టడాని కి మాత్రమే ముందుకు వచ్చాయట. దీంతో ఈ డీల్ ఇంకా క్లోజ్ కాలేదని సమాచారం.
ఇదిలా ఉండగా.. కర్నాటక లో తెలుగు చిత్రాల కు భారీ ఆదరణ లభిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ మన చిత్రాల ను అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇక, అక్కడ అత్యధిక బిజినెస్ ను RRR మూవీ చేసుకుంది. దీనికి ఏకంగా రూ. 38 కోట్లు వ్యాపారం జరిగింది. ఇప్పుడు 'పుష్ప ది రూల్'కు రూ. 30 కోట్లు జరిగితే ఇది కర్నాటకలో రెండో స్థానానికి చేరుతుంది.