Begin typing your search above and press return to search.
పుష్పరాజ్ ఇంట్రడక్షన్.. మాస్ కు పూనకాలేనా?
By: Tupaki Desk | 28 Jan 2023 8:00 PMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా పుష్ప మేనరిజమ్స్ దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ సినిమాని మరింత పాపులర్ అయ్యేలా చేశాయి. శ్రీవల్లి, ఊ అంటావా మావ ఊహూ అంటావా.. పాటల్లో బన్నీ వేసిన హుక్ స్టెప్స్ సినిమాని మరింతగా పాపులర్ అయ్యేలా చేశాయి.
ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో 'పుష్ప 2' పై భారీ అంచనాలు నెలకొన్నియా. ఉత్తరాదిలో ఈ మూవీ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే వంద కోట్లు రాబట్టడంతో అక్కడ కూడా 'పుష్ప 2' క్రియేట్ చేయబోతే రికార్డ్స్ కోసం ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 1 లో కూలి సిండికేట్ స్మగ్లర్ గా ఎదిగిన క్రమాన్ని చూపించగా.. ఆ సిండికేట్ ని ఏలే వ్యక్తి వరల్డ్ వైడ్ గా మోస్ట్ వాంటెడ్ రెడ్ సాండల్ స్మగ్లర్ గా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడనే నేపథ్యంల సాగుతుందని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఈ మూవీని విదేశాల్లోనూ చిత్రీకరించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జపాన్, థాయ్ లాండ్, బ్యాంకాక్ వంటి దేశాల్లోనూ ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాలని చిత్రీకరించనున్నారట.
ఫస్ట్ పార్ట్ ని మించి అత్యంత భారీ బడ్జెట్ తో ఊమించని లొకేషన్ లతో భారీ స్తాయిలో తెరపైకి రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఇటీవలే హీరో అల్లు అర్జున్ వైజాగ్ చేరుకున్నాడు.
ప్రస్తుతం అక్కడ పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సాంగ్ ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారట. సాంగ్ థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం అని చెబుతున్నారు. ఆ స్తాయిలో పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సాంగ్ ని భారీ గా ప్లాన్ చేశారట. ఈ పాటకు దేవీశ్రీప్రసాద్ పూనకాలు తెప్పించే రేంజ్ లో మ్యూజిక్ అందించాడని, గోల్డెన్ గ్లోబ్ పురస్కారం సొంతం చేసుకున్న 'నాటు నాటు' పాటని అందించిన చంద్రబోస్ ఈ మూవీకి సరికొత్త మాసీవ్ సాంగ్ ని అందించాడట.
వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో ఈ పాటని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారట. ఇంత వరకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని అందించని చిత్ర బృందం ఈ మూవీ షూటింగ్ సగభాగం పూర్తయిన తరువాతే ప్రోమోని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు నటిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని 2024 జనవరికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.