Begin typing your search above and press return to search.

పూరి ఫిక్స్ అయ్యాడు దేవుడే లేడ‌ని!

By:  Tupaki Desk   |   11 Aug 2021 7:26 AM GMT
పూరి ఫిక్స్ అయ్యాడు దేవుడే లేడ‌ని!
X
డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మ‌నిషి లో రియాలిటీ గురించి ఎంతో గొప్ప‌గా చెబుతారు. త‌న‌ సినిమాల ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తారు. అది వీలుకాక‌పోతే డైరెక్ట్ గా సోష‌ల్ మీడియాల్లో తాను అనుకున్నది ...చెప్పాల‌నుకున్న‌ది సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తారు. చాలా విష‌యాల్లో గురువు రాంగోపాల్ వ‌ర్మ‌కు చాలా ద‌గ్గ‌ర‌గానే పూరి కూడా ఉంటారు. ఆయ‌న తానా అంటే వ‌ర్మ తందానా! అంటార‌ని చాలా సంద‌ర్భాలో రుజువైంది. రుజువు కాని సంద‌ర్భం ఏదైనా ఉంది! అంటే అది ప‌వ‌న్ క‌ల్యాణ్‌ విష‌యంలోనే! అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ య‌ని నిందిస్తూ వ‌ర్మ  కొన్ని పోస్టులు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఆ విష‌యంలో వ‌ర్మ‌ది నూటికి నూరుపాళ్లు త‌ప్పు అని ఒప్పుకున్నారు. పూరి ఆ ఒక్క విష‌యంలో వ‌ర్మ దారిలోకి వెళ్ల‌లేదు. ఇత‌ర అన్ని విష‌యాల్లో పూరి ఓటు ఎప్పుడూ వ‌ర్మ‌కే ప‌డుతుంది. తాజాగా దేవుడు విష‌యంలో మ‌రోసారి గురువునే స‌మ‌ర్ధించారు. కానీ పూరి ఈసారి మంచి వివ‌ర‌ణ  కూడా ఇచ్చారు. దేవుడు ఉన్నాడా?  లేడా ? అంటూ పూరి యూ ట్యూబ్ లో ఓవీడియో వ‌దిలారు. అస‌లు దేవుడు ఎవ‌రు? ఎలా ఉంటాడు? అని క్వ‌శ్చ‌న్ చేస్తూనే స‌మాధానం కూడా చెప్పేసారు. దేవుడు ఉన్నాడా?  లేడా? అన్న‌ది ఒక్క ముక్క‌లో స‌మాధానం చెప్పండ‌ని అడిగారు. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే అంటూ చాలానే చెప్పారు.

ఒక వ్య‌క్తి జిడ్డు మూర్తిని నిల‌దీసి ఇలా అడిగారు. జిడ్డు చాలా మంచి మ‌నిషి కాబ‌ట్టి చాలా సున్నితంగా స‌మాధానం చెప్పారు. అయినా వాడికి అర్ధం కాలేదు. సున్నితంగా చెబితే కుద‌ర‌ద‌నుకుని! అస‌లు దేవుడు మ‌నిషిని చేసాడా?  లేక మ‌నిషి దేవుడ్ని సృష్టించాడా? అని మ‌ళ్లీ రెండు ప్ర‌శ్న‌లు రెయిజ్ చేసారు. దీనికి పాయింట్-1 లో దేవుడే మ‌నుషుల్ని త‌యారు చేసాడ‌నుకుందాం. స్టీవ్ జాబ్స్ తయారు చేసిన ఐ పోన్ ఎక్స‌లెంట్ పీస్..ఎల‌న్ మ‌స్క్ త‌యారు చేసిన టెస్లా కారు అమేజింగ్ పీస్. మ‌రి వీళ్లు చేసిన‌వే అద్భుతాలు అయితే! ప‌వ‌ర్ ఫుల్ దేవుడు చేసిన మ‌నుషులు ఎలా ఉండాలి? ఒక్కొక్క‌డు మైండ్ బ్లోవింగ్ అయి ఉండాలి క‌దా. కానీ మ‌నం అలా ఉన్నామా? అంటే క‌చ్చితంగా లేము.

ఎవ‌డ్ని కెలికినా రక‌ర‌కాల బాధ‌లు స‌మ‌స్య‌ల‌తో ఉంటున్నారు.  మ‌న‌శ్శాంతి లేకుండా బ్ర‌తుకుతున్నారు. ఎందుకు బ్ర‌త‌కుతున్నామా? అని ఇంకొంత మంది బుర్ర బాదుకుంటున్నారు. మ‌రి మ‌నం  దేవుడుకి పుట్టిన బిడ్డ‌లం అయిన‌ప్పుడు ఇవ‌న్నీ ఏంటి? మ‌న‌కి ప‌క్కోడి  మీద జాలి ద‌య క రుణ ఉండ‌దు. మాన‌వ‌త్వం అస‌లే ఉండ‌దు. దైవ‌త్వం  ఏమూలనా క‌నిపించ‌దు. ఇన్ని చెత్ల క్వాలిటీస్ మ‌నిషిలో ఉన్నాయి  కాబ‌ట్టి మ‌నం క‌చ్చితంగా దెవుడు బిడ్డ కాదు. పాయింట్ -2 విష‌యానికి వ‌స్తే మ‌నిషే దేవుడ్ని త‌యారు చేసాడ‌నుకుందాం.  అయితే ఆ దేవుడు ఎలా ఉంటాడా? ఐన్ స్టీన్ డిజైన్ చేసాడా దేవుడిని. లేక న్యూట‌న్ లాంటి జీనియ‌స్ లు త‌యారుచేసారా?  లేక మ‌న‌లాంటి యావ‌రేజ్ ..బిలో యావ‌రేజ్ మ‌నుషులు త‌యారు చేసారా?   వాళ్ల భ‌యం.. ఆక‌లి నుంచి.. ఆశ‌ల నుంచి..తీర‌ని కోరిక‌ల నుంచి మాత్ర‌మే దేవుడు పుట్టాడు.

దేవుడు మీద న‌మ్మ‌శ‌క్యం కానీ స్టోరీ రాశారు. లాజిక్ కి అంద‌ని సీన్స్ క్రియేట్ చేసారు. మ‌నుషుల‌తో క‌లిసి దేవుడికి కూడా ఓ క్యారెక్ట‌ర్ రాసేసారు. స్వ‌ర్గ‌మ‌నే ఊహాలోకాన్ని  క్రియేట్ చేసారు. అదే చివిరి గ‌మ్యం అంటూ అక్క‌డికి టిక్కెట్లు అమ్మేస్తున్నారు. ఏ బొమ్మ‌ను మొక్కాలి? ద‌య‌నీయ‌మైన‌ గంద‌ర‌గోళ మ‌న‌స్త‌త్వం నుంచి పుట్టిన  దేవుడు  నిజం కాదు. చివ‌రిగా దేవుడు ఉన్నాడా?  లేడా? అని అడిగితే లేనేలేడ‌ని ముగించారు. ఇంత‌కుముందే బిజినెస్ మేన్ చిత్రంలో దేవుడి గురించి పూరి క్లాస్ తీస్కున్న తీరును యూత్ ఇంకా మ‌ర్చిపోలేరు.