Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరే నా పెళ్లి చేసారు: స్టార్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   27 April 2020 3:40 PM IST
ఆ ఇద్దరే నా పెళ్లి చేసారు: స్టార్ డైరెక్టర్
X
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. పూరీ ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత చాలా మంది హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి వారిని స్టార్ హీరోలను చేసిన ఘనత కూడా ఉంది. అందుకే మధ్యలో కొన్ని ప్లాపులు వచ్చిన పూరి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవలే పూరి మళ్లీ సూపర్ హిట్ అందుకున్నాడు. ’ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ హిట్ కొట్టడమే కాకుండా.. హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో రామ్ కి అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు పూరి. తాజాగా తన పెళ్ళి నాటి విషయాల గురించి చెప్పాడు.

పూరీ పెళ్లి అనుకున్నట్లుగా గ్రాండ్ గా జరగలేదు. ఎంతో సింపుల్ గా సినిమాటిక్ స్టైల్లో జరిగిందట. తన ప్రేమ గురించి చెప్తూ.. నిన్నే పెళ్లాడతా సినిమాకు పని చేస్తున్న సమయంలోనే తాను ప్రేమలో పడ్డానని.. పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా అకస్మాత్తుగా వచ్చిందని తెలిపాడు. ఆ సమయంలో తన జేబులో ఒక్క రూపాయి కూడా లేదని.. స్నేహితులు మాత్రమే తనకు అండగా ఉన్నారని గుర్తుచేసుకున్నాడు. అంతేగాక తన పెళ్లి ఎర్రగడ్డలోని ఓ గుడిలో జరిగిందట. అప్పటి టాలీవుడ్ టాప్ యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందట.. ఇక నటి హేమ తనకు పెళ్లి బట్టలు తీసుకొచ్చిందని చెప్పాడు పూరీ జగన్నాథ్. ఇక అక్కడే ఉన్న మరికొందరు స్నేహితులు కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చారని ఎమోషనల్ అయ్యాడు. పెళ్ళైందో లేదో వెంటనే షూటింగ్ కి వెళ్లానని చెప్పుకొచ్చాడు.