Begin typing your search above and press return to search.

'ప్రతి ఇంట్లో రైతు పుట్టాల్సిన టైమ్ దగ్గర పడింది.. నాయకులంతా తలపాగా చుట్టి రైతన్నల్లా మారాలి'

By:  Tupaki Desk   |   12 Oct 2020 5:00 PM GMT
ప్రతి ఇంట్లో రైతు పుట్టాల్సిన టైమ్ దగ్గర పడింది.. నాయకులంతా తలపాగా చుట్టి రైతన్నల్లా మారాలి
X
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తన పూరీ మ్యూజింగ్స్‌ లో ఈరోజు ‘వర్టికల్ ఫార్మింగ్’ అనే అంశం గురించి వివరించాడు. వర్టికల్ ఫార్మింగ్ చేస్తే రాబోయే పాతికేళ్లలో అందరికీ తిండి దొరుకుతుందని పేర్కొన్నారు. పూరీ మాట్లాడుతూ.. 7 వేల సంవత్సరాల క్రితమే అగ్రికల్చర్ నేర్చుకున్నాం. కొత్త పద్ధతులు ఎన్నో కనిపెట్టాం. ఇప్పుడున్న లేటెస్ట్ పద్దతి వర్టికల్ ఫార్మింగ్. దీంతో మనం రోజూ కావలసిన కూరగాయలు సులువుగా పండించుకోవచ్చు. ఇందులో మూడు మెథడ్స్ ఉన్నాయ్. హైడ్రో ప్యానిక్స్ - ఆక్వా ప్యానిక్స్ - ఏరో ప్యానిక్స్. హైడ్రో ప్యానిక్స్ అంటే సాయిల్ అవసరం లేకుండా క్యాప్సిల్స్ లో న్యూట్రిషన్ వాటర్ లో పెంచటం. ఆక్వా పానిక్స్ అంటే ఫిష్ ప్రాన్స్ లాంటివి పెంచుతూ వాటి మధ్యలో మొక్కలు పెంచటం. ఇక ఏరో ప్యానిక్స్ అంటే ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మిస్ట్ లాంటిని వాడుతూ పెంచడం. ఈ మూడు పద్ధతులు మంచివే. కాకపోతే హైడ్రో ప్యానిక్స్ సులువైంది. దీనికి ఎకరాలెకరాలు భూమి అవసరం లేదు. మీ టెర్రస్ మీద బాల్కనీలో పార్కింగ్ ఏరియాలో ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా పండించుకోవచ్చు. పొలంలో 100 లీటర్ల నీళ్లు కావాల్సి వస్తే ఇక్కడ 5 లీటర్ల నీళ్లు ఉంటే చాలు. రసాయనిక ఎరువులు వాడకుండా కూరగాయలు మన ఇంట్లో పండించుకోవచ్చు'' అని తెలిపాడు.

''వర్టికల్ ఫార్మింగ్ గురించి ఒకసారి గూగుల్ చేయండి. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. వాళ్ళు అమ్మే ఒక చిన్న కిట్ కొనుక్కొని బాల్కనీలో నాలుగు మొక్కలు పెంచండి. మీకే అర్థం అవుతుంది. ఆ తర్వాత మీ మేడ మీద మొత్తం పెట్టొచ్చు. ఇంటికి సరిపడే హెల్తీ కూరగాయలు రెడీ. ఈ పద్ధతి పాటిస్తే 2 ఎకరాలలో పండించే కూరగాయలను 200 గజాలలో పండించొచ్చు. ఈ రోజుల్లో బయట వెజిటబుల్స్ కొనాలంటే భయమేస్తుంది. రోజు రోజుకి జనాభా పెరుగుతోంది. రాబోయే పాతికేళ్లలో ఇప్పుడున్న కల్టివేషన్ 70 శాతం పెరిగితే కానీ ఫ్యూచర్ లో మనకు ఫుడ్ దొరకదు. నిమిషానికి 250 బేబీస్ చొప్పున జనాభా పెరుగుతోంది. రోజుకు 4 లక్షలమంది పుడుతున్నారు. ఈ లెక్కన 2 డికేడ్స్ లో 10 బిలియన్ జనాభా పెరిగి ప్రపంచం మొత్తం కిక్కిరిసిన ట్రైన్ లా తయారవుతుంది. అంతమందికి ఫుడ్ సఫ్లయ్ ఎక్కడి నుంచి వస్తుంది. బిలియన్ల మంది ప్రజలు అపార్ట్మెంట్స్ లో గబ్బిలాల్లా వేలాడుతూ కనిపిస్తారు. ఫుడ్ ఎక్కడి నుంచి తెస్తావ్. మీకు పుట్టే ప్రతి బిడ్డా బతకాలంటే ఒక్కొక్కడికి ఒక ఎకరం కావాలి. ఎకరం కొని ఆ తర్వాత కొడుకుని కనాలంటే జరుగుతుందా? జరగదు. ఇండియాలో 80 మిలియన్ హెక్టార్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అమెరికా కంటే చైనా కంటే ఎక్కువ మనది. అయినా అది మనకు సరిపోదు. ఒక పక్క రైతు చచ్చిపోతుంటే అగ్రికల్చర్ ఎలా పెరుగుతుంది. అందుకే మనమే రైతులా మారిపోవాలి. మన కిచెన్ పక్కనే కూరగాయలు పెరగాలి. ప్రతి ఇంట్లో రైతు పుట్టాల్సిన టైమ్ దగ్గర పడింది. ఇంటింటా వ్యవసాయం రావాలి. ఎవరి కూరగాయలు వాడే పండించుకోవాలి. అయితే ప్రభుత్వమే వెర్టికల్ ఫార్మింగ్ గురించి అవగాహన కల్పించాలి'' అని పూరీ సూచించారు.

''రైతులకు ఈ ఫార్మింగ్ కిట్లు కొనే స్తోమత కూడా ఉండదు. వ్యవసాయం చేయలేక కష్టాలు పడలేక ఏ రైతూ తన కొడుకు వ్యవసాయం చేయాలని కోరుకోవడం లేదు. అందుకే రైతు కోసం ఎదురు చూడకుండా మనమే రైతుగా మారుదాం. ప్రభుత్వమే ముందడుగు వేయాలి. ప్రతి ఊర్లో వెర్టికల్ ఫార్మింగ్ మొదలు పెట్టాలి. ఇప్పుడు మన రైతులు పండించేవి మనకి భవిష్యత్ లో సరిపోవు. ప్రతి ఊర్లో ప్రభుత్వమే పేద షెడ్స్ వేసి అందులో వెర్టికల్ ఫార్మింగ్ చేయాలి. ఏ ఊరికి కావాల్సినవి ఆ ఊర్లోనే పండేలా తయారుచేయాలి. అది ఇప్పటి నుంచి మొదలుపెడితేనే పాతికేళ్ల తర్వాత మన అవసరాలు తీరుతాయి. లేదంటే మన పిల్లలకు తిండి కూడా దొరకదు. వెర్టికల్ ఫార్మింగ్ వల్ల 75 శాతం ల్యాండ్ ఫ్రీ అవుతుంది. దాంట్లో వరి గోధుమ బార్లీ మొక్కజొన్న వేరుశనగ పండించొచ్చు. భవిష్యత్ లో 70 శాతం వ్యవసాయం పెరగాలంటే ఇదే మంచి మార్గం. ఈ పద్ధతి వల్ల చాలా మంది రైతులకు ఉపాధి కూడా దొరుకుతుంది. ప్రభుత్వం దీన్ని గమనించి సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాను. వ్యవసాయం రైతులే చేయాలా? ఏం గవర్నమెంట్ చేయకూడదా? నాయకులంతా తలపాగా చుట్టి రైతన్నల్లా మారాలి'' అని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.