Begin typing your search above and press return to search.

ఉపావాసం బుద్ధిస్ట్ గురించి చెప్పిన పూరి మ్యూజింగ్స్

By:  Tupaki Desk   |   13 Jun 2021 2:10 PM GMT
ఉపావాసం బుద్ధిస్ట్ గురించి చెప్పిన పూరి మ్యూజింగ్స్
X
లాక్ డౌన్ స‌మ‌యాన్ని పూరి అస్స‌లు వృధా చేయ‌లేదు. ఆయ‌న పూరి మ్యూజింగ్స్ పేరుతో ర‌క‌ర‌కాల విష‌యాల‌పై నిర్మొహ‌మాటంగా ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేస్తుండ‌డంతో అవ‌న్నీ యూత్ కి బాగా నచ్చేస్తున్నాయి. ఇంత‌కుముందు ఒకే దీవిలో క‌లిసి ఉన్న జంట ఎందుకు విడాకులు తీసుకున్నారో చాలా బాగా చెప్పారు.

పూరి మ్యూజింగ్స్ లో తాజాగా బుద్ధిస్ట్ గురించి ఉపవాసం గురించి వివ‌రించారు. తాజా పోడ్ కాస్ట్ ఆడియో ఫైల్ లో అస‌లు మ‌నిషి తిండి ఎలా తినాలి? ఎంత తినాలి? అనేది తెలిపారు.

బుద్ధిస్టుల చేతిలోని బౌల్ ని బెగ్గింగ్ బౌల్ అంటారని ఆ కాన్సెప్ట్ ని క్రియేట్ చేసింది బుద్ధుడు అని .. బౌల్ నిండా మ‌నిషికి స‌రిప‌డే తిండే ప‌డుతుంద‌ని తెలిపారు. మ‌నం మామూలుగా అయితే నాలుగింత‌ల తిండి లాగించేస్తామ‌ని అన్ని జ‌బ్బుల‌కు కార‌ణం ఈ అతి తిండి అని తెలిపారు.

నేటి రోజుల్లో బుద్ధిస్టులు రోజుకు రెండుసార్లు ఆహారం తింటున్నార‌ని... మిగతా సమయం అంతా ఉపవాసం ఉంటార‌ని పూరి తెలిపారు. సుమారు 18 గంటలపాటు ఉపవాసం చేస్తారన్నారు. బుద్దిస్టులే కాదు మనం కూడా ఇలాంటి ఉపవాసాలు చేస్తే ఎంతో మంచింది. వీలైతే ప‌ల్లెంలో కాకుండా చిన్న గిన్నెలో తినండి.. అప్పుడు అదుపులో ఉంటుంది. లెక్క‌గా తింటాం.. అని తెలిపారు. మీరు తిండి తగ్గించాలంటే ఓరియాకీ బౌల్ సెట్‌ అని దొరుకుతుంది. దాన్ని ఆర్డర్ చేయండి. అంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో అనుకోకండి బలంగానే ఉంటారు..అని పూరి అన్నారు. లాక్ డౌన్ ముగిసింది .. క‌రోనా త‌గ్గింది కాబ‌ట్టి నెమ్మ‌దిగా లైగ‌ర్ ని తిరిగి ప‌ట్టాలెక్కించేందుకు పూరి టీమ్ సిద్ధ‌మ‌వుతోంది.