Begin typing your search above and press return to search.

పూరి మ్యూజింగ్స్: విడాకులవ్వ‌కూడ‌దంటే ఇలా చేయాలి

By:  Tupaki Desk   |   3 Jun 2021 2:30 PM GMT
పూరి మ్యూజింగ్స్: విడాకులవ్వ‌కూడ‌దంటే ఇలా చేయాలి
X
ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో అమెరికా చైనా లాంటి చోట విప‌రీతంగా విడాకుల‌య్యాయి. భార‌త‌దేశంలో కొంచెం త‌క్కువే అయినా ఈ లాక్ డౌన్ లో ఎక్కువ విడాకుల కేసులు న‌మోద‌య్యాయని చెబుతున్నారు పూరి. ఆయ‌న పూరి మ్యూజింగ్స్ లో విడాకుల శాతం పెర‌గ‌డానికి కార‌ణ‌మేంటో చెప్పుకొచ్చారు.

భార్యాభ‌ర్త‌లు ఒక‌రిపై ఒక‌రు అధిక అంచనాలు క‌లిగి ఉండ‌డం స్వేచ్ఛ విడాకులకు ప్రధాన కారణాలు. లాక్ డౌన్ కారణంగా జంటలు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు. అంచనాలు నెరవేరక‌పోతే విడాకులు పెరుగుతున్నాయ‌ని ప్రూవైంది అని పూరి తెలిపారు.

మ‌రి దీనికి ప‌రిష్కార‌మే లేదా? అంటే పెళ్లికి ముందు కొన్ని రూల్స్ పెట్టాల‌ని అన్నారు. వివాహానికి కౌన్సెలింగ్ తప్పనిసరి. స్త్రీ- పురుషులకు రెండేళ్ల పని అనుభవం లేకుండా వివాహాన్ని అనుమతించకూడదు. అప్పుడే అనవసరమైన వివాహాలు తప్పవు. విడాకుల వంటి వివాహానికి సరైన చట్టపరమైన ప్రక్రియ ఉండాలని పూరి అన్నారు. ఒంట‌రిగా ఆగ‌లేక పెళ్లాడేయ‌కూడ‌దని చెప్పారు.

లాక్ డౌన్ స‌మ‌యంలో భార్య- భర్తలు దూరంగా ఉండాల‌ని 30 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదని సూచించారు. ఖాళీ ఉంటే మీ స్నేహితులతో మాట్లాడండి. టీవీ చూడండి.. వాట్సాప్ లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. అప్పుడే విడాకుల‌వ్వ‌కుండా ఈ మహమ్మారిలో కాపాడుకోగలరు.. అని తెలిపారు. పెళ్లికి ముందే భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ జాబ్ చేయాల‌న్న రూల్ ని చెప్ప‌డం యూత్ కి బాగానే క‌నెక్ట‌వుతుంది. అధిక అంచ‌నాలు కూడా వివాహాలు ఫెయిల‌వ్వ‌డానికి నిరాశ‌కు కార‌ణ‌మ‌వుతోంద‌ని చెప్పిన‌దాంట్లో వాస్త‌వం అంద‌రికీ అర్థం కావాల్సి ఉంటుంది.