Begin typing your search above and press return to search.
మనిషి క్యారెక్టర్ ఎప్పుడూ మారుతూ ఉండాలి
By: Tupaki Desk | 9 Nov 2020 9:30 AM ISTడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈమద్య కాలంలో పూరి మ్యూజింగ్స్ పేరుతో ఇస్తున్న సందేశాలు.. ఆయన చెబుతున్న జీవిత సత్యాలు.. ఆయన చెబుతున్న జీవిత పాఠాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరిని నొప్పించినా ఎక్కువ శాతం మందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు చాలా మందికి జీవితంలో ఎలా ఉండాలో పాఠాలు చెబుతున్నాయి. తాజాగా పూరి మనిషి క్యారెక్టర్ ఎలా ఉండాలో తనదైన శైలిలో బోల్డ్ గా చెప్పారు.
సాదారణంగా అయితే మనిషి అన్న వాడు ఒక క్యారెక్టర్ తో ఉండాలి. అలాంటి వాడే మంచి వాడు మహనీయుడు అవుతాడు అంటూ సమాజం అంటూ ఉంటుంది. కాని పూరి మాత్రం మనిషి అనే వాడు ఒకే తరహా క్యారెక్టర్ లో బంధీ అవ్వొద్దు. అలా అయ్యావు అంటే నీ చుట్టు ఉన్న వారు నిన్న ఆట ఆడేసుకునేందుకు ప్రయత్నిస్తారు. మనిషి అభిరుచులు.. మాట్లాడే విధానం.. ఏదైనా విషయానికి రియాక్ట్ అయ్యే విధానం.. డ్రస్సింగ్ ఇలా ఇవన్నీ కన్సిస్టెంట్ గా ఉన్నట్లయితే అతడి క్యారెక్టర్ ను ఈజీగా అందరు చెప్పగలరు. అవన్నీ కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉండే వాడు అంటేనే సమాజానికి ఇష్టం. అతడిని అంతా క్యారెక్టర్ ఉన్నవాడు అంటూ ఉంటారు. మంచి వాడు అంటూనే అలాంటి వారిని కబడ్డీ ఆడేసుకునేందుకు ప్రయత్నిస్తు ఉంటారు.
అందుకే పరిస్థితులకు తగ్గట్లుగా ప్రతి రోజు ప్రతి పూట క్యారెక్టర్ అనేది మార్చుకోవాలంటూ పూరి చెబుతున్నాడు. నాకు తెలుసు అయ్యగారు మీరు మాటిస్తే ప్రాణం అయినా వదులుకుంటారు అంటూ అవతలి వాడు అన్నప్పుడు నీ క్యారెక్టర్ ను ఫిక్స్ చేసి మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నట్లుగా నువ్వు అర్థం చేసుకోవాలి. నీ క్యారెక్టర్ ను ఫిక్స్ చేసేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాని వాటన్నింటిని పట్టించుకోకుండా రోజుకు ఒకలా మారుతూ ఉండాలి. అసలు విషయం చెప్పాలంటే నిజమైన మనిషికి అస్సలు క్యారెక్టర్ ఉండదు అంటూ పూరి ఈ టాపిప్ పై చాలా బాగా మాట్లాడారు.