Begin typing your search above and press return to search.
బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ కోసం పూరీ మధ్యవర్తిత్వం..?
By: Tupaki Desk | 19 Feb 2021 9:00 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఛత్రపతి ఒరిజినల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీలో మార్పులు చేర్పులు చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతిలాల్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో బెల్లంకొండ సరసన నటించే హీరోయిన్ కోసం వేట కానసాగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించిన మేకర్స్ తాజాగా మరో బ్యూటీని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ భామ అనన్య పాండేను ఇందులో హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఇందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయిన మేకర్స్.. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ద్వారా ఆమెను సంప్రదిస్తున్నారట. అనన్య ప్రస్తుతం పూరీ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే పూరీ మధ్యవర్తిత్వంతో అమ్మడిని ఒప్పించాలని చూస్తున్నారట. మరి ఈ ఆఫర్ కు అనన్య ఓకే చెప్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే సాయి శ్రీనివాస్ ను 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా పరిచయం చేసిన వీవీ వినాయక్.. ఇప్పుడు 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇది వినాయక్ కి హిందీ డెబ్యూ మూవీ కావడం గమనార్హం.