Begin typing your search above and press return to search.

లైగర్ హిట్ అయితే మహేష్‌ కు ఆ సినిమా చేజారినట్లే!

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:27 AM GMT
లైగర్ హిట్ అయితే మహేష్‌ కు ఆ సినిమా చేజారినట్లే!
X
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్‌ ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలను చేసి అక్కడ మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ తో చేస్తున్న లైగర్ సినిమా తో దర్శకుడు పూరి భారీ స్కెచ్‌ వేసినట్లుగా తెలుస్తోంది. లైగర్‌ సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయాలని భావిస్తున్నాడట. అందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున లైగర్‌ సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నాడు. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్ కరణ్ జోహార్ కూడా లైగర్ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. కనుక లైగర్‌ సినిమాకు అక్కడ మంచి బిజినెస్‌ అయ్యే అవకాశం ఉంది. లైగర్‌ ను అక్కడ కరణ్‌ జోహార్‌ ప్రమోట్‌ చేస్తున్నాడు కనుక జనాల్లో అంచనాలు భారీగా ఉంటాయి.

లైగర్‌ సినిమా కనుక మినిమంగా హిట్ అయినా కూడా అక్కడ మంచి వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉంది అంటున్నారు. తెలుగు తో పాటు సౌత్‌ లో అన్ని భాషలు మరియు హిందీలో కూడా లైగర్ సినిమా హిట్ అయితే పూరి జగన్నాద్‌ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పూరి జగన్నాద్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన జనగనమణ సినిమాను బాలీవుడ్‌ కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయిదు ఆరు సంవత్సరాలుగా మహేష్ బాబుతో ఆ సినిమాను చేయాలని పూరి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో మహేష్ బాబు ఫొటోతో ఆ సినిమా పోస్టర్ ను కూడా పూరి రిలీజ్ చేశాడు. కాని మహేష్ బాబు బిజీ షెడ్యూల్‌ మరియు ఇతర కారణాల వల్ల సినిమాను బాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

పూరి జగన్నాద్‌ ఇప్పటికే జనగనమణ సినిమా కథను బాలీవుడ్‌ కు చెందిన ఒక స్టార్‌ హీరోకు వినిపించాడట. ఆ కథను ఆయన చేసేందుకు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇదే కథలో విలన్ గా మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరో నటించేందుకు ఓకే చెప్పాడట. అయితే ప్రస్తుతం పూరి చేస్తున్న లైటర్ సినిమాకు వచ్చే ఫలితాన్ని బట్టి ఆ సినిమా బాలీవుడ్‌ లో తెరకెక్కే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. లైగర్‌ సినిమా బాలీవుడ్‌ లో హిట్‌ అయితే హిందీలో జనగనమణ ను ఏ ఒక్కరు కూడా ఆపలేరు అనేది జనాల అభిప్రాయం. అదే కనుక నిజం అయితే మహేష్‌ బాబు ఒక మంచి సినిమా ను వదులుకున్న వాడు అవుతాడు అంటూ టాలీవుడ్‌ మీడియా వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు మాత్రం తెలుగు లోనే పాన్ ఇండియా స్థాయిలో మహేష్ బాబుతో జనగనమణ సినిమాను చేయాలని కోరుకుంటున్నారు. ఏం జరుగబోతుంది అనేది కాలమే నిర్ణయించాలి.