Begin typing your search above and press return to search.
చిరు - పూరి కాంబోలో సినిమా సెట్టయ్యేనా...?
By: Tupaki Desk | 21 April 2020 9:00 PM ISTటాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఉన్న క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. హీరోలకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి దానికి స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసిన ఘనత ఆయనది. పూరి సినిమాలో మినిమమ్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అనే తరహాలో క్రేజ్ ఏర్పడింది. డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ గా పిలవబడే పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో 20 ఏళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ 20 ఏళ్ల సినీ ప్రయాణంలో పూరి 35 సినిమాలు డైరెక్ట్ చేశాడు. దాదాపు స్టార్ హీరోలందరితో పూరి వర్క్ చేశాడు. నాగార్జున - పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - అల్లు అర్జున్ - రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరికి బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన పూరి.. బాలకృష్ణ - ప్రభాస్ - ఎన్టీఆర్ లతో వర్క్ చేసి ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేశాడు. కానీ మెగాస్టార్ చిరంజీవిని మాత్రం డైరెక్ట్ చేయలేకపోయాడనే వెలితి మాత్రం ఆయనలో మిగిలిపోయింది. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని పూరి జగన్నాథ్ చాలా ప్రయత్నాలు చేశారు.
అప్పట్లో ఆయన రీ ఎంట్రీ 150వ మూవీకి దాదాపు పూరి జగన్నాథ్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. దీనికి 'ఆటోజానీ' అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు పూరీ. అంతా ఓకే అనుకున్న తరుణంలో కొన్ని అనివార్య కారణాల వలన సినిమా ఆగిపోయింది. అయితే చిరంజీవితో సినిమా ఆగిపోవడం ఇదే తొలిసారి కాదు.. ఆటోజానీకి ముందు కూడా మూడు సార్లు కథ చెప్పినా ఫలితం లేకుండా పోయిందంట. అందులో రెండుసార్లు దురదృష్టవశాత్తు రెండు సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయిన తర్వాత ఆగిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ వీరి కాంబినేషన్ గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వీరి కాంబో గురించి డిస్కస్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం చిరు కోసం స్క్రిప్ట్ రాస్తున్నా అని పూరీ చెప్పనప్పటికీ లాక్ డౌన్ టైం లో రెండు స్టోరీలు రెడీ చేస్తున్నాడని సమాచారం. అంతేకాకుండా త్వరలోనే మెగాస్టార్ ని మీట్ అవబోతున్నాడట. పూరి - మెగాస్టార్ కాంబోలో సినిమా కచ్చితంగా ఉంటుంది అనే ఇండికేషన్స్ అయితే ఇస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పూరీ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో 'ఫైటర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు పూరీ. కరణ్ జోహార్ - చార్మీ నిర్మిస్తున్న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వరుసగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నాడు. మరి వీరి కాంబోలో ఎప్పుడు సినిమా పట్టాలెక్కుతుందో చూడాలి.