Begin typing your search above and press return to search.

పూరి రోగ్‌.. హిందీలోకి వెళ్తోంది

By:  Tupaki Desk   |   11 Feb 2017 12:49 PM GMT
పూరి రోగ్‌.. హిందీలోకి వెళ్తోంది
X
త‌న సినిమాలు రిలీజ‌య్యే ముందు.. త‌ర్వాత రీమేక్-సీక్వెల్ ముచ్చ‌ట్లు చెప్ప‌డం స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కు అల‌వాటు. బిజినెస్ మేన్.. టెంప‌ర్.. జ్యోతిల‌క్ష్మి.. ఈ సినిమాల‌న్నింటికీ సీక్వెల్స్ ఉంటాయ‌న్నాడు. బిజినెస్ మేన్.. టెంప‌ర్ రీమేక్స్ గురించి కూడా చ‌ర్చ జ‌రిగింది. ఐతే ఇప్ప‌టిదాకా ఆ దిశ‌గా అడుగులేమీ ప‌డ‌లేదు. ఇప్పుడు పూరి కొత్త సినిమా ‘రోగ్’ విష‌యంలోనూ ఇలాంటి క‌బురే బ‌య‌టికి వ‌చ్చింది. ఇంకా ఈ సినిమా రిలీజే కాలేదు.. ఫ‌లితం ఏంటో తెలియ‌లేదు. కానీ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు రోగ్ యూనిట్ వ‌ర్గాలు చెప్పాయి. ‘రోగ్‌’ను హిందీలో స‌ల్మాన్ ఖాన్ నిర్మాణంలో రీమేక్ చేస్తార‌ట‌.

గ‌త ఏడాది ఆదిత్య పంచోలి కొడుకు సూర‌జ్ పంచోలిని స‌ల్మానే త‌న బేన‌ర్ ద్వారా ‘హీరో’ సినిమాతో అరంగేట్రం చేయించిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రం అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. అయిన‌ప్ప‌టికీ సూర‌జ్ ను స‌ల్మాన్ వ‌దిలేయ‌ట్లేదు. త‌న చేతుల‌తోనే హిట్టిచ్చి పంపాల‌ని చూస్తున్నాడు. ఈ మ‌ధ్యే స‌ల్మాన్ పూరి చెప్పిన ‘రోగ్’ క‌థ విన్నాడ‌ట‌. సినిమా కూడా కొంత వ‌ర‌కు చూశాడ‌ట‌. అత‌ను తెగ ఇంప్రెస్ అయిపోయి.. సూర‌జ్ హీరోగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయ‌డానికి ఓకే చెప్పాడ‌ట‌. పూరి ‘పోకిరి సినిమాను హిందీలో స‌ల్మాన్ వాంటెడ్ పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక క‌న్న‌డ కుర్రాడు ఇషాన్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌వుతున్న ‘రోగ్‌’ను త్వ‌ర‌లోనే తెలుగు.. క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.