Begin typing your search above and press return to search.

బుల్లి బుజ్జిగాడు హీరోగా పూరీ మూవీ

By:  Tupaki Desk   |   31 Aug 2017 5:50 AM GMT
బుల్లి బుజ్జిగాడు హీరోగా పూరీ మూవీ
X
బుజ్జిగాడు మూవీలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో కనిపించాడు ఆకాష్ పూరీ. దర్శకుడు పూరీ జగన్నాధ్ కొడుకే ఈ ఆకాష్. ఇతడిని టాలీవుడ్ హీరో చేయాలన్నది పూరీ కోరిక. ఎంతో మంది హీరోలను సక్సెస్ ఫుల్ గా లాంఛ్ చేసిన పూరీ.. తన కొడుకు విషయంలో మరింత కేర్ తీసుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

ఇప్పటికే తన కొడుకును హీరో చేసేందుకు అవసరమైన పక్కా స్క్రిప్ట్ పూరీ దగ్గర ఉందనే టాక్ అంటున్నారు. అయితే.. ఆకాష్ ను హీరో చేసేందుకు సరైన సమయం కోసం చూస్తున్నాడట పూరీ. ప్రస్తుతం పైసా వసూల్ ప్రమోషన్స్ లో ఈ దర్శకుడు బిజీగా ఉండగా.. త్వరలోనే కొడుకును హీరో చేసే ప్రాజెక్టుపై అనౌన్స్ మెంట్ కు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. పైసా వసూల్ తర్వాత పూరీ చేయబోయే సినిమా ఇదే అనే టాక్ కూడా ఉంది. తన కొడుకు గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కావడంతో.. అతడి బాడీ లాంగ్వేజ్ కి తగిన రీతిలోనే పక్కా స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేసుకున్నాడట పూరీ జగన్నాధ్.

అయితే.. ఆకాష్ లాంఛ్ చేయడం విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్న పూరీ.. మందుగా తగిన ట్రైనింగ్ అంతా తీసుకున్నాకే కొడుకును హీరో చేయాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి ఆకాష్ ఇప్పటికే ఆంధ్రా పోరీ అనే సినిమాలో హీరోగా నటించాడు. కానీ ఆ మూవీ సక్సెస్ కాలేదు. తర్వాత కొడుకు ఆకాష్ కు తన దగ్గరే నటన.. డైరెక్షన్ లో ట్రైనింగ్ ఇచ్చిన పూరీ.. ఇప్పుడు హీరోగా లాంచ్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇది కూడా పూరీ స్టైల్ హీరోయిజంతోనే ఉండనుందని టాక్.