Begin typing your search above and press return to search.

పూరి జగన్నాథ్.. మళ్ళీ రామ్ లేదా అతను?

By:  Tupaki Desk   |   4 Sept 2022 5:00 AM IST
పూరి జగన్నాథ్.. మళ్ళీ రామ్ లేదా అతను?
X
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ అందుకున్న పూరీ జగన్నాథ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీ అనేలా ఉండేది. ఆయన ఫ్లాప్ సినిమాలలో కూడా ఎంతో కొంత మినిమం ఎంటర్టైన్మెంట్ అయితే ఉండేది.

ఆ విధంగా పూరి జగన్నాథ్ రైటింగ్ స్టైల్ తో ఆకట్టుకునేవాడు. మినిమం డైలాగ్స్ కూడా హైలెట్ గా ఉండేవి. కానీ లైగర్ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా చేశారో ఏమో కానీ అందులో ఏ మలుపులో కూడా పూరి తన పెన్ పవర్ చూపించలేకపోయారు.

దానికి తోడు విజయ్ దేవరకొండ లాంటి మంచి టాలెంటెడ్ హీరోతో ఆయన మ్యాజిక్ క్రియేట్ చేయకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు ఇంతకుముందు పూరి జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా ఆయన రేంజ్ కు తగ్గది కాదు. ఆ సినిమా ఏదో మాస్ ఫ్లోలో పాటలతో రామ్ కొత్త స్టైల్ ఆకట్టుకుంది కానీ పూరి జగన్నాథ్ మార్క్ తో అయితే ఆ సినిమా ఆకట్టుకోలేదనే టాక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు పూరి లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకోవడంతో అతనితో విజయ్ మళ్లీ జనగణమన ప్రాజెక్టును రీస్టార్ట్ చేస్తాడా అంటే అదే పెద్ద సాహసం అనే చెప్పాలి. నిజానికి విజయ్ అలాంటి సాహసం చేయడానికి అయితే ఆసక్తి చూపే ఛాన్స్ లేదు. లైగర్ సినిమాకు వీరి హైప్ మాటలు కూడా పెద్ద మైనస్ అయ్యాయి. మరోసారి జనాలు అంత ఈజీగా నమ్మరు కాబట్టి జనగణమన మళ్లీ పెట్టాలెక్కే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి.

ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి రామ్ పోతినేని మాత్రమే అందుబాటులో ఉన్నాడు. అతను బోయపాటి సినిమా చేస్తున్నప్పటికీ కూడా మరే ఇతర దర్శకులు కూడా సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక మరోవైపు మీడియా రేంజ్ లో తక్కువగా సెట్ అయ్యే వారిలో శర్వానంద్ ఉన్నాడు.

అతను కాస్త క్లాస్ క్యారెక్టర్లు మాత్రమే కాకుండా తలుచుకుంటే మాస్ క్యారెక్టర్లు కూడా చేయగలరుడు అని కొన్ని సార్లు నిరూపించాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా శర్వా పూరి గారితో సినిమా చేయాలని ఉందని అన్నాడు. ఒక విధంగా శర్వాకు కూడా ఇతర బడా దర్శకుల నుంచి ఆఫర్స్ ఏమి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి పూరితో చేస్తే ఏదైనా మ్యాజిక్ వర్కౌట్ కావచ్చని ఆశపడుతున్నాడు. మరి పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.