Begin typing your search above and press return to search.

మళ్లీ పట్టాలెక్కుతున్న రోగ్

By:  Tupaki Desk   |   13 Sep 2016 3:30 PM GMT
మళ్లీ పట్టాలెక్కుతున్న రోగ్
X
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమా విడుదల కాకుండా ఆగిపోవడం అంటే రికార్డ్. పూరీ పేరు ఉంటే చాలు.. కచ్చితంగా బయ్యర్లు ఉండే పరిస్థితి. కానీ కన్నడ- తెలుగు భాషల్లో రూపొందిన రోగ్ చిత్రం మాత్రం అనూహ్యంగా సైడైపోయింది. చాలా రోజులుగా వార్తల్లో కూడా వినిపించని ఈ చిత్రం.. ఇప్పుడు విడుదల చేసేందుకు మూహూర్తం నిర్ణయించారనే టాక్ వినిపిస్తోంది.

శాండల్ వుడ్ ప్రొడ్యూసర్ సీఆర్ మనోహర్ మేనల్లుడు ఇషాన్ ను పరిచయం చేస్తూ రోగ్ చిత్రాన్ని తెరకెక్కించాడు పూరీ. హీరోయిన్ల సమస్యతో చాలా లేట్ అయిన ఈ మూవీ.. మొత్తానికి ఫినిషింగ్ దశకు చేరుకున్నాక.. అనూహ్యంగా ఆగింది. మధ్యలో కొందరు హీరోయిన్స్ అయితే.. కొంత షూటింగ్ చేశాక వెళ్లిపోవడంతో బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయిందనే టాక్ ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో 'ఇజం' తీస్తూ పూరీ ఫుల్లు బిజీ అయిపోవడంతో.. ఇక రోగ్ సంగతి పట్టించుకునే టైం లేకపోయింది.

ఇప్పుడు రోగ్ ని డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నాడట నిర్మాత. ఈ మేరకు పూరీని సంప్రదించారని.. ఇజం రిలీజ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేద్దామని పూరీ హామీ ఇచ్చాడని తెలుస్తోంది. దాదాపుగా బ్యాంకాక్ లో మొత్తం సినిమా షూటింగ్ జరుపుకున్న రోగ్ లో.. పూజా ఝవేరి.. మన్నారా చోప్రాలు హీరోయిన్ లుగా నటించారు.