Begin typing your search above and press return to search.

అల్ప సంతోషిలా మారిన పూరి!!

By:  Tupaki Desk   |   3 Sept 2017 11:04 PM IST
అల్ప సంతోషిలా మారిన పూరి!!
X
దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇప్పుడు ఫుల్ టెన్షన్ లో పడిపోయిన మాట అంగీకరించాల్సిందే. పూరీ మెంటాలిటీ ప్రకారం తను వ్యక్తిగా టెన్షన్ పడకపోయినా.. కెరీర్ కి మాత్రం మరో మచ్చ వచ్చేసేలా ఉంది. ఎంతో హైప్ క్రియేట్ అయిన పైసా వసూల్.. నిరాశ పరిచేలాగే కనిపిస్తోంది.

మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను నిలబెట్టుకోవడంలో కూడా పైసా వసూల్ విఫలమైంది. బాలకృష్ణ వన్ మ్యాన్ షో పూర్తిగా వేస్ట్ అయిపోయిందని చెప్పచ్చు. 33 కోట్లు తెస్తేనే హిట్ అనిపించుకునే ఈ సినిమా.. ఇప్పుడు 20 వరకూ వచ్చినా గ్రేట్ అనేస్తున్నారు ట్రేడ్ జనాలు. అయితే.. పూరీ మాత్రం పైసా వసూల్ కు పైసలు పెద్దగా రాలకపోయినా.. థియేటర్లలో రాని కాగితాలు పూలు చూపించి.. ఆనందపడిపోతున్నాడు. పైసా వసూల్ ప్రదర్శించిన ఓ థియేటర్ లో ప్రదర్శన తర్వాతి పరిస్థితి అంటూ ఓ ఫోటో పోస్ట్ చేయగా.. ఇందులో సీట్స్ తో సహా మొత్తం థియేటర్ అంతా పూలు కాగితాలతో నిండిపోయి.. గార్బేజ్ గా మారిన సీన్ కనిపిస్తుంది. దీన్ని చూపించి ఇదో సెలబ్రేషన్ అనేస్తున్నాడు పూరీ జగన్నాధ్.

పెద్ద హీరో సినిమా.. ఫ్లాప్ అయినా కూడా.. మొదటి మూడు రోజులూ ఇలా కాయితాలు వేయడం కామన్ గా జరిగే విషయమే. అసలు ఇందుకోసమే వరుసగా టికెట్స్ బుక్ చేసుకునే వీరాభిమానులు కూడా ఉంటారు. అలాగే ఈ మద్య కాలంలో మరీ పేలవమైన సినిమాలు తీయడం పూరీకీ కామనే. వీటిలో మొదటిది మార్చలేం. మార్చాల్సిన అవసరం కూడా లేదు. రెండో విషయం మాత్రం పూరి చేతిలోనే ఉంది. దాన్ని మార్చుకుంటే.. ఇలా అల్పసంతోషి టైపులో ఓ థియేటర్ ఫోటోతో ఏదో చెప్పేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు.