Begin typing your search above and press return to search.

పూరికి సూపర్‌ స్టార్‌ ఆఫర్‌ నచ్చలేదా?

By:  Tupaki Desk   |   25 Oct 2019 11:00 PM IST
పూరికి సూపర్‌ స్టార్‌ ఆఫర్‌ నచ్చలేదా?
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల 'దబాంగ్‌ 3' చిత్రం ప్రమోషన్స్‌ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ పూరి జగన్నాధ్‌ గారితో సినిమా చేయడం కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తప్పకుండా ఆయనతో సినిమా చేస్తానంటూ పూరికి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చాడు. సౌత్‌ డైరెక్టర్‌ కు బాలీవుడ్‌ నుండి ఆఫర్‌ అంటే గొప్ప విషయం. అలాంటిది ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ను డైరెక్ట్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.

ఇంత పెద్ద ఆఫర్‌ వచ్చినా కూడా ఇప్పటి వరకు పూరి స్పందించక పోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఇటీవలే ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో ఫామ్‌ లోకి వచ్చినట్లుగా అనిపిస్తున్న పూరి తన తదుపరి చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కించబోతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు పూరి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తర్వాత పూరి చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయంపై క్లారిటీ లేదు. అయినా కూడా సల్మాన్‌ ఖాన్‌ మూవీ విషయంలో ఆసక్తి లేకపోవడం ఏంటీ అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

బాలీవుడ్‌ లో గతంలో పూరి ఒక సినిమా చేశాడు. ఆ సినిమా నిరాశ పర్చింది. అందుకే బాలీవుడ్‌ లో పూరికి సినిమా చేసే ఆసక్తి లేదని అందుకే సల్మాన్‌ ఆఫర్‌ కూడా పూరికి నచ్చలేదు అంటూ సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌ లోనే పూరి తన సత్తా చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని కొందరు మాత్రం ఇప్పుడు కాకున్నా కొంత సమయం తర్వాత అయినా సల్మాన్‌ ఖాన్‌ తో తప్పకుండా పూరి మూవీ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పూరి ఎప్పుడు.. ఎలా స్పందిస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.