Begin typing your search above and press return to search.
ఈసారైనా మెగా బాస్ ని ఒప్పిస్తాడా లేదా?
By: Tupaki Desk | 23 July 2020 10:00 AM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్పీడ్ గురించి చెప్పేదేముంది? ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా `ఫైటర్` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకుని మాంచి ఊపు మీదున్న పూరి రౌడీ బోయ్ ని నెక్ట్స్ లెవల్ కమర్షియల్ హీరోని చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఈసారి సౌత్ తో పాటు నార్త్ మీద కూడా గట్టి కసితో ఉన్నాడు. ఇక ఇదే రెట్టించిన ఉత్సాహంతో అతడు అగ్ర కథానాయకుల్ని లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు.
బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టు.. హీరోల్ని క్యూలో పెట్టు! అన్న ప్రాతిపదికన అతడు వరుసగా స్టార్ హీరోలకు కథలు వినిపించే పనిలో ఉన్నాడు. అక్కడ ఓకే అయినా అవ్వకపోయినా ఫైటర్ తో తానేంటో చూపించి హీరోలకు మాట్లాడే స్కోప్ ఇవ్వకూడదన్న పంతంతో ఉన్నాడట. అదంతా సరే కానీ .. పూరి క్యూలో ఎవరెవరు ఉన్నారు? అంటే.. ప్రభాస్.. ఎన్టీఆర్ లాంటి హీరోలకు ఇంతకుముందు కథలు వినిపించాడని.. మహేష్ తో సినిమాకి నమ్రతనే ఓ మెట్టు దిగి వచ్చి స్వయంగా పూరీని సంప్రదించారని ప్రచారమైంది.
తాజా సమాచారం ప్రకారం.. పూరి ఎంతో సైలెంటుగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి స్టోరి వినిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి తన ఫేవరెట్ హీరో చిరంజీవితో సినిమా చేయాలని పూరి చాలాకాలంగా కల గంటున్నాడు. ఇంతకుముందు ఆటోజానీ అంటూ అదిరిపోయే మాస్ మసాలా స్క్రిప్టుని వినిపించాడు చిరుకి. కానీ అందులో ద్వితీయార్థం తనకు నచ్చలేదని ఓ పబ్లిక్ వేదికపై చిరు ఎలాంటి దాపరికం లేకుండా అనేయడం పూరీని హర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్క్రిప్టును మార్చి చిరుకి మళ్లీ వినిపిస్తానని కూడా పూరి అన్నాడు. అదంతా సరే కానీ.. ఇన్నాళ్టికి లాక్ డౌన్ సమయంలో చిరు తీరిక సమయాన్ని చూసి పూరి మళ్లీ కలిసాడట. ఆ ఇద్దరూ స్క్రిప్టును డిస్కస్ చేసారా లేదా? అన్నదానిపై సరైన క్లారిటీ లేదు. అయితే పూరి కలయిక మాత్రం కచ్ఛితంగా సినిమా గురించే. ప్రస్తుతం చిరు ఆచార్య చిత్రంతో బిజీ. అలాగే పూరి ఫైటర్ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఈలోగానే చిరు కోసం పూర్తి స్క్రిప్టు రెడీ చేస్తాడన్నమాట.