Begin typing your search above and press return to search.

కొడుకు కోసం పూరీ త్యాగం!!

By:  Tupaki Desk   |   28 Sep 2017 4:35 AM GMT
కొడుకు కోసం పూరీ త్యాగం!!
X
పూరీ జగన్నాధ్.. ఒకప్పుడు క్రేజీయెస్ట్ డైరెక్టర్. తాను ఓ పెద్ద సీక్వెన్స్ తీసి హీరోయిజం ఎలివేట్ చేయాల్సి ఉంటే.. పూరీ జగన్నాధ్ ఒకే ఒక్క డైలాగ్ తో ఆ పవర్ ను మొత్తం తెచ్చేయగలడు అంటూ.. దర్శకధీరుడు రాజమౌళితో పొగిడించుకున్న స్టార్ డైరెక్టర్. కానీ ఇప్పుడు పూరీ పరిస్థితి అంత పాజిటివ్ గా లేదు. చేస్తున్న సినిమాలేవీ జనాలను మెప్పించడం లేదు. కనీసం గతంలో పూరీ డైలాగ్స్ కోసం అయినా ఓ సారి సినిమా చూసేయచ్చు అని భావించే ఆడియన్స్ ఉండేవారు. ఇప్పుడు ఆ ఫ్లేవర్ కూడా అడుగంటిపోతోంది. ఏతావాతా అటు రైటర్ గాను.. ఇటు డైరెక్టర్ గాను ఫెయిల్ అవుతున్నాడు పూరీ జగన్నాధ్.

ఇప్పుడు తన కొడుకు ఆకాష్ పూరీని లాంఛ్ చేయడానికి ఈ దర్శకుడు స్వయంగా నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నాడనే న్యూస్ సెన్సేషన్ అవుతోంది. ఒక స్టార్ డైరెక్టర్ సినిమా చేస్తానంటే.. నిర్మాతలు సూట్ కేసులతో రెడీగా ఉండాల్సిన సిట్యుయేషన్. పైగా పూరీతో సినిమా అంటే ప్రొడ్యూసర్స్ కు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏళ్ల తరబడి తీయడు కాబట్టి.. వడ్డీ బాధలు ఉండవు. సగం సినిమాను.. రెండు మూడు పాటలను బ్యాంకాక్ లోనో.. ఏదో ఒక బీచ్ లోనో లాగించేస్తాడు కాబట్టి.. ఖర్చులు కూడా తక్కువగానే అవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ముందే బడ్జెట్ ఇంత అంటూ ప్యాకేజ్ మాట్లేడేసుకుని.. అంతలోనే ఫినిష్ చేస్తాడు కాబట్టి అసలు టెన్షనే ఉండదు.

వీటన్నిటితో పాటు లవ్ స్టోరీలు డీల్ చేయడంలో పూరీకి స్పెషల్ క్రేజ్ ఉంది. బద్రి.. ఈడియట్ లాంటి లిస్ట్ చూస్తే.. పూరీ లవ్ స్టోరీలకు అట్రాక్షన్ అర్ధమవుతుంది. మరి అలాంటి దర్శకుడు.. తన కొడుకుతో ఓ లవ్ స్టోరీ చేస్తానంటే.. నిర్మాతలు కరువైన పరిస్థితి అంటే.. అది దారుణమే అని చెప్పాలి. కానీ జ్యోతి లక్ష్మి.. లోఫర్.. రోగ్.. పైసా వసూల్.. లాంటి ఘనమైన ట్రాక్ రికార్డ్ కారణంగా.. పూరీతో ప్యాకేజ్ డీల్ కి కూడా ఎవరూ ముందుకు రావడం లేదట. కానీ తన ట్యాలెంట్ ను మళ్లీ ప్రొజెక్ట్ చేసి.. ప్రూవ్ చేసుకునేందుకు స్వయంగా నిర్మాత అయిపోతున్నాడట పూరీ జగన్నాధ్. అఫ్ కోర్స్.. నిర్మాణ బాధ్యతలతో పాటు.. హీరోయిన్ ను ఫైనల్ చేసే డ్యూటీ ఛార్మీ చేతిలోనే పెట్టాడనే ఓ టాక్ మాత్రం ఉంది.