Begin typing your search above and press return to search.

పూరితో బాలయ్య: ఈ రోజు నవమా అష్టమా?

By:  Tupaki Desk   |   28 March 2017 12:29 PM IST
పూరితో బాలయ్య: ఈ రోజు నవమా అష్టమా?
X
నందమూరి బాలకృష్ణకు జాతకాలు.. ముహూర్తాల మీద కొంచెం గురి ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. తన సినిమాల ప్రారంభోత్సవం దగ్గర్నుంచి రిలీజ్ వరకు ప్రతి సందర్భంలోనూ ఆయన జాతకాలు.. ముహూర్తాలకు అనుగుణంగానే నడుచుకుంటారు. ఐతే పూరి జగన్నాథ్ దీనికి పూర్తి భిన్నం. తన గురువు రామ్ గోపాల్ వర్మ ప్రభావమో.. లేక స్వతహానే ఆయన ఆలోచన విధానం అలాంటిదో తెలియదు కానీ.. ఆయనకు దేవుడి మీద.. ఈ ముహూర్తాలు.. జాతకాల మీద అంతగా గురి లేదు. ఐతే పూర్తి భిన్నమైన ఆలోచనలున్న ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు సినిమా చేస్తున్నారు. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి పూరి మీడియాతో పంచుకున్నాడు.

‘‘బాలయ్య గారితో పోలిస్తే నాకు దైవారాధన తక్కువే. ఆ విషయంలో ఆయన వేరు. నేను వేరు. ఒకసారి ఉన్నట్లుండి ‘ఈ రోజు అష్టమా.. నవమా?’ అని అడిగారు. ‘నాకు తెలియదు సార్‌’ అన్నాను. మీరు పట్టించుకోరా ఇలాంటివి.. అని అడిగారు. పట్టించుకోనని చెప్పాను. సరే... ఎవరిష్టం వాళ్లదని.. తనకు ఇది ఇష్టమని.. నమ్మకమని బాలయ్య అన్నారు’’ అని పూరి చెప్పాడు. ఇక బాలయ్యతో పని చేసిన అనుభవం గురించి పూరి చెబుతూ.. ‘‘నేను ఆయనతో సినిమా అనగానే ఒకలా అనుకున్నాను. కానీ దానికి భిన్నమైన అనుభవం ఎదురైంది. ఆయనతో పని చేయడాన్ని భలే ఎంజాయ్ చేస్తున్నా. నేనే కాదు నా యూనిట్‌ మొత్తం ఎంజాయ్‌ చేస్తోంది. నా టీం అంతటికీ బాలయ్యతో పని చేయడం తొలిసారి. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. పది రోజుల పాటు తొలి షెడ్యూల్ చేశాం. రెండు రోజులు మాత్రమే పని చేసినట్లుందని బాలయ్య అన్నారు. బాలయ్యను ఎవ్వరూ చూపించని విధంగా కొత్తగా చూపించబోతున్నా. డైలాగులు కూడా కొత్తగా ఉంటాయి’’ అని పూరి అన్నాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/