Begin typing your search above and press return to search.
వహ్వా... క్యా బాత్ హై పూరి!
By: Tupaki Desk | 5 April 2016 9:22 AM ISTపూరి జగన్నాథ్ మళ్లీ ముంబై వెళ్లాడు. ఈసారి ఎందుకు వెళ్లాడనేది మాత్రం తెలీదు. దీని గురించి తప్పకుండా ఆలోచించాల్సిందే. ముంబై గ్రౌండ్ ఎప్పుడు ఎలా ఉందో పిచ్ రిపోర్ట్ తో సహా పూరికి అందజేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన సూచనల మేరకే పూరి అక్కడ సినిమా చేస్తుంటాడు. ఇదివరకు అమితాబ్ బచ్చన్ తో పూరి సినిమా చేయడానికి కారణం వర్మనే. ఆయనే `బుడ్డా హోగా తేరా బాప్` సినిమాకి లైన్ క్లియర్ చేసి పెట్టాడు. పూరి నేరుగా వెళ్లి అమితాబ్ కి కథ వినిపించి సినిమా చేసేశాడు. అయితే అప్పట్నుంచి పూరి మరో హిందీ సినిమా చేసింది లేదు. అక్కడో సినిమా ఉంటుందీ, ఉంటుందీ అని చెబుతున్నాడు కానీ... వెళ్లడం మాత్రం ఆయనకి కుదరడం లేదు.
ఇప్పుడు ఉన్నట్టుండి పూరి ముంబైలో ప్రత్యక్షమవడం అందరినీ ఆలోచింపజేస్తోంది. పూరి ముంబైలో ఏం చేస్తోంది రామ్ గోపాల్ వర్మ ఓ ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టాడు. చుట్టూ అమ్మాయిలతో కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తూన్నట్టు ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఫొటోకి తగ్గట్టుగానే రామ్ గోపాల్ వర్మ క్యాప్షన్ పెట్టాడు. `పూరి ముంబైలో లేడు... ముంబైయ్యే పూరిలో ఉంది` అని ట్వీట్ చేశాడు వర్మ. దీన్నిబట్టి అక్కడ పూరి ఎంతగా హడావుడి చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. గురుశిష్యులిద్దరూ ముంబైలో తిరుగుతున్నారంటే పెద్ద స్కెచ్చే వేశారని అర్థం చేసుకోవల్సిందే. సంజయ్ దత్ తో సినిమా చేయాలనేది పూరి ఆలోచన. ఆ కథని వినిపించడానికే పూరి అక్కడికి వెళ్లాడా లేక మరే ఇతర కారణమేదైనా ఉందా అన్నది తేలాల్సి వుంది.