Begin typing your search above and press return to search.

మహిళలు, దేవుడిపై పడ్డాడేంటో పూరీ?

By:  Tupaki Desk   |   17 Dec 2015 11:00 PM IST
మహిళలు, దేవుడిపై పడ్డాడేంటో పూరీ?
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పూరీ తీసిన లోఫర్ మూవీలో కొన్ని డైలాగ్స్ వివాదాస్పదం అవుతున్నాయి. సాధారణంగానే డైలాగ్స్ విషయంలో పూరీ ఎటాక్ డైరెక్ట్ గా ఉంటుంది. ఈ సారి మాత్రం దేవుడిని, మహిళలను టార్గెట్ చేస్తూ వేసిన కొన్ని పంచ్ లు.. బాగా పదునుగా ఉన్నాయి. సినిమా పరంగా మిక్సెడ్ రివ్యూస్ వస్తున్నా.. కొన్ని సెగ్మెంట్లను మాత్రం లోఫర్ బాగానే ఆకట్టుకుంటోంది.

"పూర్వ కాలంలో డైనోసార్లు ఉండేవి. తర్వాత అంతరించిపోయాయి. ఇప్పుడు కావాలంటే వస్తాయా? అలాగే కన్నాంబ - సావిత్రి - మీ అమ్మ.. కావాలంటే దొరకరు ఇప్పుడు. ఇప్పటి అమ్మాయిలంతా ఎప్పుడు ఎవరితో లేచిపోతారో వారికే తెలియదు" అంటూ ఓ స్ట్రాంగ్ డైలాగ్ రాశాడు పూరీ. ఆడవాళ్లను డైనోసార్లతో పోల్చడం, ఈ కాలం అమ్మాయిలను చీప్ గా జమ కట్టడం వివాదం అవుతోంది. పూరీ ఎటాక్ మహిళలతోనే అగిపోలేదు. దేవుడి మీద కూడా దాడి చేసేశాడు. " ఆ దేవుళ్లెవరైనా పిల్లలని కన్నారా.. వాడికేం తెలుస్తుంది కడుపు కోత అంటే ఏంటో " రేవతితో తిట్టిపోయించాడు. ఇది దేవుడిని నమ్మే ఆస్తికులను హర్ట్ చేసే ఛాన్సులు ఎక్కువే. పోనీ దీన్ని బాధతో ఓ అమ్మ పడ్డ ఆవేదనగా సరిపెట్టుకున్నా.. అమ్మాయిలందరూ ఎవడితో ఒకడితో లేచిపోతారనే మాటను.. పూరీ ఎలా సమర్ధించుకుంటాడో?

పవర్ ఫుల్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండే పూరీ.. హీరోయిన్ల కేరక్టర్ ని మరీ వల్గర్ గా తయారు చేయడనే గుర్తింపు ఉంది. ఎందుకంటే పూరీ సినిమాల్లో హీరోయిన్స్ ఎవరూ.. హీరో మీద పడిపోతూ రొమాన్స్ చేసేలా కేరక్టర్స్ ఉండవు. మరి లోఫర్ లో మాత్రం.. ఎందుకు మహిళలను కించపరచాలని అనిపించిందో!!