Begin typing your search above and press return to search.

మెగాస్టార్ స్టైల్ లో పూరీ!

By:  Tupaki Desk   |   29 Sept 2017 10:00 AM IST
మెగాస్టార్ స్టైల్ లో పూరీ!
X
దర్శకుడు పూరీ జగన్నాధ్ సహజంగా తన పనులు తాను చేసుకుంటూ పోతాడు. చెప్పాల్సిన మాటలను కూడా తన స్టైల్ లో పంచ్ డైలాగ్స్ ఫార్మాట్ లోనే చెబుతాడు. తనకంటూ ఫిక్స్ చేసుకున్న రెగ్యులర్ ఫార్మాట్ ను ఫాలో అవడం తప్ప.. వేరే వాటిని అంతగా పట్టించుకోడని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ఇవే లక్షణాలు పూరీ సృష్టించే హీరో పాత్రల్లోనూ.. సినిమాలోనూ కనిపిస్తుంటాయి.

ఇది మొనాటనీ అయిపోయిందని అందరూ విమర్శిస్తుండడంతో.. ఇప్పుడు తన స్టైల్ మార్చి సినిమా చేయబోతున్నాడు పూరీ. తన కుమారుడు ఆకాష్ హీరోగా మెహబూబా అనే మూవీని పీరియాడిక్ ఫిలింగా తీస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. పూరీలో ఇది చాలా పెద్ద మార్పు అనాల్సిందే. అయితే ఇదే ఛేంజ్ ఈ దర్శకుడి వ్యక్తిగత ప్రవర్తనలో కూడా కనిపిస్తుండడం ఆశ్చర్యకరం. సహజంగా ప్రచారాలకు ఆర్భాటాలకు పూరీ చాలా దూరం. రీసెంట్ గా పూరీ జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా తన కోసం వచ్చిన అభిమానులకు ఇలా వందనాలు చేశాడు పూరీ. ఎప్పుడూ ఇలాంటి హడావుడి చేయని పూరి.. ఇప్పుడు ఎందుకో ప్రచార ఆర్భాటాలపై ఫోకస్ పెడుతున్నాడని అంటున్నారు.

నిజానికి అమితాబ్ బచ్చన్ ప్రతీ ఆదివారం అభిమానులకు (ఇంటిదగ్గర విజిటర్లకు) ఇలాగే ఫోజ్ ఇస్తూ నమస్కరిస్తాడు. ఇప్పుడు పూరి కూడా సేమ్ టు సేమ్ అదే పోజ్.. స్టైల్ దించేశాడు. ఇది అమితాబ్ ను అనుకరించడంలో భాగమో.. లేక పూరీలో వచ్చిన మార్పు ఫలితమో ఇప్పుడప్పుడే చెప్పలేం.