Begin typing your search above and press return to search.
పూరీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా..?
By: Tupaki Desk | 13 Nov 2020 1:00 PM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యారర్ ఫై పూరీ - ఛార్మీ కౌర్ - బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఓ భారీ షెడ్యూల్ కంప్లీట్ అయింది. గతేడాది 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ.. అదే జోష్ లో ఫైటర్ కోసం వర్క్ చేస్తున్నాడు. అయితే స్టార్ డైరెక్టర్స్ అందరూ ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా అనౌన్స్ చేస్తున్న తరుణంలో పూరీ నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే విషయంపై క్లారిటీ లేదు.
అప్పట్లో పూరీ జగన్నాథ్ - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో మరో సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు తో హ్యాట్రిక్ సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వచ్చింది. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర తో ఓ సినిమా కమిటైన పూరీ.. మహేష్ ని కలిసి స్టోరీ చెప్పనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో అనుకున్నారు. కానీ ఆ తర్వాత దీని గురించి ఎలాంటి న్యూస్ రాలేదు. ఈ నేపథ్యంలో పూరీ తన కొడుకు ఆకాష్ ని హీరోగా పెట్టి ఓ సినిమా చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ వేరే దర్శకుడుని పరిచయం చేస్తూ తనయుడు పూరీ ఆకాష్ తో 'రొమాంటిక్' అనే సినిమా నిర్మిస్తున్నాడు. ఇంతకముందు 'మెహబూబా' అనే సినిమా తీయగా అది ప్లాప్ గా మిగిలిపోయింది. ఇప్పుడు కొడుకుతో మరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడేమో చూడాలి.