Begin typing your search above and press return to search.

నమ్మించి 100కోట్లు మోసం చేసారని వాపోయిన టాప్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   20 April 2020 8:30 PM IST
నమ్మించి 100కోట్లు మోసం చేసారని వాపోయిన టాప్ డైరెక్టర్
X
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఈరోజుకి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. దర్శకుడిగా బద్రి సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం మొన్నటి ఇస్మార్ట్ శంకర్ వరకు విజయవంతంగా కొనసాగింది. ఈ 20ఏళ్లలో పూరీ జగన్నాథ్ దాదాపు 37 సినిమాలు రూపొందించాడు. ఇన్నేళ్ళలో పూరీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు. విజయాలను ఎంజాయ్ చేసాడు. కానీ పూరీ ఫామ్ తగ్గింది, ప్లాప్ లలో ఉన్నాడు అన్నప్పుడల్లా బ్లాక్ బస్టర్లతో కంబ్యాక్ అవుతూ వస్తున్నారు. బడ్జెట్ ఎంతైనా తక్కువ టైమ్ లో సినిమాను రూపొందించడం పూరీ నైజం. అయితే ఈ రోజు ఆయన దర్శకుడిగా 20ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు ఆయనను సినీ ప్రముఖులు, తన సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పూరీ తన కెరీర్లో ఎదుర్కొన్నవి, మోసపోయిన సందర్భాలను గుర్తుచేసుకొన్నారు. తను నమ్ముకున్న స్నేహితులే తనను ఎలా మోసం చేసారో గుర్తుచేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. 'పూరికి పెద్దగా డబ్బు మీద మోజు లేదని, తన కెరీర్ లో దాదాపు 100కోట్ల వరకు నష్టపోయానని చెప్పుకొచ్చారు. తన సన్నిహితుల వలనే వంద కోట్లు లాస్ అయినట్టు తెలిపారు. అంతేగాక తను సంపాదించినంత డబ్బు ఈ తరం డైరెక్టర్లు ఎవరు కూడా సంపాదించలేదని చెప్పారు. తనకు డబ్బు మీద భూముల మీద ఆసక్తి లేదని, కేవలం సినిమాలే జీవితంగా బతుకుతున్న తనను తన స్నేహితులే మోసం చేసారని తెలిపారు. వాళ్లను గుడ్డిగా నమ్మినందుకే 100కోట్లు నష్టపోయినట్లు చెప్పి వాపోయారు. అలాంటి పెద్ద తప్పుల నుండి కోలుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని, బాలయ్య బాబుతో మరో సినిమా కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు' తన మదిలో మాటను బయటపెట్టాడు.