Begin typing your search above and press return to search.
ఛోటా.కె ని మోసం చేసి పవన్ ని లాక్ చేసాడు
By: Tupaki Desk | 23 April 2020 11:40 AM ISTకుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్! .. క్లాసిక్ డేస్ లిరిక్ ఇది. ఈ పాటలోలానే పూరి చేసిన ఆ పని టాలీవుడ్ లో ఆల్వేస్ హాట్ టాపిక్. మధ్యవర్తికి ఒక కథ వినిపించి.. హీరోకి వేరొక కథ చెప్పి.. చివరికి బ్లాక్ బస్టర్ కొట్టి పూరి ఆడిన మైండ్ గేమ్ నిరంతరం ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చకొస్తూనే ఉంటుంది. అసలు ఆ కథేంటి? అంటే.. పూరి మాటల్లోనే వినాలి మరి.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `బద్రి` సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పూరి తెరకెక్కించిన `బద్రి` అప్పట్లో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అన్న చెల్లెళ్ల ప్రేమ.. రివెంజ్ డ్రామా నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే చిత్రమిది. ఈ మూవీలో పవన్ సరసన అమీషా పటేల్.. రేణు దేశాయ్ కథానాయికలుగా నటించారు. అమీషాకు అన్న పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించారు. పవన్ - ప్రకాష్ రాజ్ మధ్య ఠగ్ ఆఫ్ వార్ తెర ఆద్యంతం రక్తి కట్టిస్తుంది. ఈ మూవీ అప్పట్లో పవన్ ఇమేజ్ ని అమాంతం పెంచింది. అటు పవన్ కి ఇటు పూరీకి కెరీర్ పరంగా మైలు రాయిగా నిలిచింది. తొలి సినిమాతోనే పూరి బ్లాక్ బస్టర్ కొట్టి హీరోలు.. నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. పవన్ రేంజ్ ని పెంచిన చిత్రంగానూ బద్రి టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలై ఈ ఏడాదికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి మధురానుభూతులను పూరి గుర్తు చేసుకున్నారు.
అసలు బద్రి కథను పవన్ కి వినిపించే ముందు బోలెడంత మెలోడ్రామా నడిచింది. సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె. నాయుడి వల్ల పవన్ కళ్యాణ్ ని కలిసారు పూరి. ఛోటాకి `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` స్టోరీ వినిపించిన పూరి పవన్ ని కలిసే ఛాన్స్ కొట్టేశాడు. కానీ పవన్ ని కలిసిన పూరి వేరే కథ చెప్పి లాక్ చేశాడు. ఆ కథే బద్రి. కానీ అప్పటికే ఛోటా.కె.. పవన్ కి ఫోన్ చేసి ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథ గురించి చెప్పాడు. ఆ సమయంలో పవన్ కూడా చివర్లో ఛోటా కె. చెప్పిన కథలా లేదు కదా! అని సందేహించారట. అందులో ఆత్మహత్యలు లాంటి సన్నివేశాలుంటాయి. కానీ ఏదో మెలిక పెట్టావ్. నాకు చెప్పినది వేరొక కొత్త కథ!! అని అన్నారుట. అందుకు పూరి అవునని అంగీకరించినా.. ఈ కథ మీ ఇమేజ్ కి సూటవుతుందని.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు తెస్తుందని నచ్చజెప్పి ఒప్పించేశారట. అలా ఛోటా.కె ని మోసం చేసి పవన్ ని లాక్ చేశాడు పూరి.
ఇలా చేస్తానని తెలిస్తే ఛోటా.కె ఆ అపాయింట్ మెంట్ ఇప్పించడని.. పైగా బూతు పురాణం అందుకుంటాడని అతడికి ఇలాంటి కథలు నచ్చవని పూరి తెలిపారు. అందుకే ఛోటాకి అబద్దం చెప్పి పవన్ వద్దకు వెళ్లాడట. దీంతో కొన్నాళ్ల పాటు ఛోటా తనతో మాట్లాడడం మానేశారు. కాలం గడిచే కొద్దీ గాయం మానుతుంది అన్న నానుడి ప్రకారం.. కొన్నాళ్లకి కోపం తగ్గి పూరితో ఛోటా మాట్లాడారు. అయితే ఇన్నేళ్ల స్నేహంలో పూరీతో ఏనాడూ ఛోటా కె పని చేయలేదు. కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు. ఛోటా తమ్ముడు శ్యామ్ కె. నాయుడు మాత్రం పూరీతో వరుసగా సినిమాలు చేశారు. ఆ ఇద్దరూ ఒకరికొకరు మంచి స్నేహితులు కూడా. పూరి సినిమాలకు ఆల్మోస్ట్ శ్యామ్.కె నే సినిమాటోగ్రాఫర్ గా కొనసాగారు.