Begin typing your search above and press return to search.

పూరి చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడుగా..!

By:  Tupaki Desk   |   15 Dec 2018 6:16 AM GMT
పూరి చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడుగా..!
X
టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్స్‌- సీనియర్‌ డైరెక్టర్స్‌ ఎక్కువ శాతం మంది ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ తో మూవీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస విజయాలతో స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండ తో ఒక్క ఛాన్స్‌ అంటూ ప్రస్తుతం ఆయన చుట్టు చాలా మంది దర్శకులు తిరుగుతున్నారు. అందులో ఒకడు పూరి జగన్నాధ్‌ అని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా పూరి జగన్నాధ్‌ మరియు విజయ్‌ దేవరకొండల కాంబో మూవీ గురించి మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.

విజయ్‌ దేవరకొండ కోసం పూరి స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడనే వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. తాజాగా డియర్‌ కామ్రేడ్‌ చిత్రం షూటింగ్‌ కోసం కాకినాడలో ఉన్న విజయ్‌ దేవరకొండను పూరి జగన్నాద్‌ కలిశాడట. అక్కడే విజయ్‌ దేవరకొండకు తాను రెడీ చేసిన స్క్రిప్ట్‌ ను కూడా నరేట్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. పూరి దర్శకుడు కాకముందు నుండే విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్ధన్‌ రావు తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల కారణంగానే ఇప్పుడు విజయ్‌ దేవరకొండ తో పూరి సినిమా చేసేందుకు కాస్త ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇండస్ట్రీ హిట్స్‌ ను తెరకెక్కించిన పూరి జగన్నాధ్‌ గత కొంత కాలంగా తీవ్రమైన పరాజయాలను ఎదుర్కొన్నాడు. పూరి కెరీర్‌ ఇక ఖతం అయినట్లేనా అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే పూరి మాత్రం ఇంకా తన లో స్టఫ్‌ ఉందని నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే రామ్‌ తో ఒక సినిమాకు ఓకే చెప్పించిన పూరి త్వరలోనే విజయ్‌ దేవరకొండ తో కూడా మూవీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ తర్వాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు. ఆ తర్వాత పూరికి డేట్లు ఇస్తాడేమో చూడాలి.