Begin typing your search above and press return to search.

పూరి గుండెల్లో గులాబి ముల్లు?

By:  Tupaki Desk   |   15 Feb 2019 6:33 AM GMT
పూరి గుండెల్లో గులాబి ముల్లు?
X
ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే.. ! `పోకిరి`లోని ఆ ఒక్క ఐటెమ్ నంబ‌ర్ తో ముమైత్ ఖాన్ పాపులారిటీ ఏ స్థాయికి ఎదిగిందో తెలిసిందే. ఆ త‌ర్వాత మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా న‌టించే స్థాయికి ఎదిగింది ముమైత్‌. త‌న త‌ర్వాత‌ ఎంద‌రో ఐటెమ్ భామ‌ల్ని పూరి టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేశారు. పూరి జ‌గ‌న్నాథ్ సినిమా అంటే ఐటెమ్ నంబ‌ర్ కి ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంద‌ని ప్రూవైంది. మాంచి జోష్ లేనిదే ఐటెమ్ నంబ‌ర్ లేనేలేద‌ని న‌మ్ముతాడు పూరి. అందుకు త‌గ్గ జోష్ తోనే చూపిస్తాడు. బిజినెస్‌మేన్ చిత్రంలో `వియ్ ల‌వ్ బ్యాడ్ బోయ్స్‌..` అంటూ మ‌త్తెక్కించే పాట‌తో ప్రేక్ష‌కుల్ని అల్లాడించాడు. అయితే ఆ త‌ర్వాత మాత్రం మ‌ళ్లీ ఆ రేంజులో ఐటెమ్ నంబ‌ర్లు క‌నిపించ‌లేదు. పూరి స్పీడ్ త‌గ్గ‌డంతో ఐటెమ్ లో పంచ్ కూడా త‌గ్గింది.

అయితే ఆ లోటు తీర్చేందుకు ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం అత‌డు తెర‌కెక్కిస్తున్న సినిమాల కోసం ఐటెమ్ భామ సెర్చ్ లో ఉన్నాడ‌ట‌. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రంలో అదిరిపోయే ఐటెమ్ నంబ‌ర్ ని మిక్స్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మ‌ణిశ‌ర్మ ఐటెమ్ పాట ట్యూన్ పైనా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. దీంతో పాటే ఆకాశ్ పూరి న‌టిస్తున్న చిత్రానికి ఐటెమ్ భామ అవ‌స‌రం క‌న‌బ‌డుతోంద‌ని స‌మాచారం. మ‌రోవైపు ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ లాంటి హాట్ గాళ్స్ క‌థానాయిక‌లుగా ఆడి పాడుతున్నారు. వీళ్ల అంద‌చందాల‌తో పోటీప‌డే ఐటెమ్ బ్యూటీ అద‌న‌పు హంగు కానుందని తెలుస్తోంది.

ముమైత్.. నోరా ఫ‌తేహి.. గాబ్రియేలా వంటి టాప్ క్లాస్ ఐటెమ్ భామ‌ల్ని ప‌రిచ‌యం చేసిన పూరి ఈసారి ఎలాంటి భామ‌ను బ‌రిలో దించుతున్నాడోనన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈసారి కూడా మ‌రో విదేశీ ముద్దుగుమ్మ‌నే బ‌రిలో దించుతాడా? అన్న‌ది కాస్త వేచి చూడాల్సిందే. ఒక‌సారి ఐటెమ్ చేసిన పాత భామ‌ల్ని తిరిగి తెచ్చే అల‌వాటే లేదు కాబ‌ట్టి ఈ ఎటెంప్ట్ కూడా తెర‌నిండుగా కొత్త అందాల్ని ప‌రిచే .. వేడెక్కించే ప్ర‌య‌త్నం చేస్తాడ‌నే ఫ్యాన్స్ అంచ‌నా వేస్తున్నారు.