Begin typing your search above and press return to search.

సముద్రం ఒడ్డున స్మార్ట్ సెంటిమెంట్

By:  Tupaki Desk   |   2 July 2019 6:23 AM GMT
సముద్రం ఒడ్డున స్మార్ట్ సెంటిమెంట్
X
మహేష్ బాబు పోకిరి సినిమాలో గలగలపారుతున్న గోదారిలా పాటలో ఇలియానా నడుము అందాలు చూసి వెర్రెక్కని కుర్రకారు లేదు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంలో మ్యూజిక్ ఎంత కీలక పాత్ర వహించిందో తనకు మాత్రమే సాధ్యమయ్యే పూరి మార్క్ పిక్చరైజేషన్ కూడా అంతే దోహదపడింది. హీరోయిన్లతో సముద్రం ఒడ్డున అందాల విందు చేయించే పూరి ఆ విషయంలో అభిమానులను ఎన్నడూ నిరాశపరచలేదు.

బిజినెస్ మెన్ లో సారొస్తారా సాంగ్ అంత వైరల్ అవ్వడంలో కారణం వేరే చెప్పాలా. టెంపర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని హై లైట్ చేయడంలో తనదైన స్టైల్ ని చూపించాడు పూరి. ఇది తన ప్రతి సినిమాలో ఫాలో అయ్యేదే అయినప్పటికీ దేనికదే విభిన్నం అని చేసేలా చేయడం పూరి ప్రత్యేకత . ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ లో కూడా అదే ట్రెండ్ కొనసాగించబోతున్నట్టు కనిపిస్తోంది

రామ్ హీరోగా రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన మూడు ఆడియో సింగల్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మణిశర్మ బాణీలు చాలా కాలం తర్వాత ఆయన స్టైల్ లో ఉన్నాయని ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవలే రిలీజ్ చేసిన ఉండిపో పాటలో మరోసారి నిధి అగర్వాల్ తో బీచ్ ఒడ్డున రచ్చ చేయించిన పూరి నభ నటేష్ ను అదే స్థాయిలో ప్రెజెంట్ చేశాడట. దీంతో ఇస్మార్ట్ శంకర్ మాస్ మసాలా హీరోయిజంతో పాటు ఇద్దరు భామల అందాలూ ఓ రేంజ్ లో హంగామా చేస్తాయన్న మాట. హిట్టు సెంటిమెంట్ కూడా రిపీట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.