Begin typing your search above and press return to search.
`జన గణ మన` బ్యాక్ డ్రాప్ ఇంట్రెస్టింగ్
By: Tupaki Desk | 25 Jun 2020 11:45 AM ISTపూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జన గణ మన`ను పట్టాలెక్కించే కసితో ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని అత్యంత భారీగా తెరకెక్కిస్తానని మొన్నటికి మొన్న ప్రకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది. `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ తో స్పీడ్ మీదున్న పూరి ఏకంగా కరణ్ జోహార్ తోనే టైఅప్ పెట్టుకున్నాడు. ఆ క్రమంలోనే అతడి కలల్ని నిజం చేసుకునేందుకు సరైన ప్లాన్ వేశాడని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవరకొండతో `ఫైటర్` తెలుగు-తమిళం-హిందీ సహా అన్నిభాషల్లో పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కానుంది.
ప్రస్తుతం ఫైటర్ చిత్రీకరణ కొవిడ్ మహమ్మారీ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేస్తూ జనగణమన ప్రాజెక్టును పూరి తెరపైకి తెచ్చారు. అయితే ఈ మూవీని మూడేళ్లుగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావించినా అనుకున్నది అనుకున్నట్టు కుదరలేదు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ నటిస్తారని ప్రకటించినా అనూహ్యంగా అతడు స్క్రిప్టు నచ్చలేదని వెనకంజ వేయడంతో వాయిదా పడిపోయింది.
`జనగణమన` నా డ్రీమ్ ప్రాజెక్ట్.. పాన్ ఇండియా రేంజులో తెరకెక్కిస్తాను! అంటూ పూరి తాజాగా వేడెక్కించే ప్రకటన చేయడంతో ఇక సెట్స్ కెళ్లడానికి అతడు సిద్ధంగా ఉన్నాడనే అర్థమవుతోంది. `జన గణ మన` టైటిల్ బావుంది. సౌండింగ్ ఇంకా బావుంది కాబట్టి కథాంశం ఎలా ఉండనుంది? అన్నది ఆరాతీస్తే .. టైటిల్ కి తగ్గట్టే దేశభక్తి కథాంశంతోనే తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇండియా బార్డర్.. సైన్యం నేపథ్యంలో జన గణ మన స్క్రిప్టును పూరి రెడీ చేశారట.
ప్రస్తుతం బార్డర్ లో చైనా-ఇండియా ఘర్షణ.. పాకిస్తాన్ తో కయ్యం హాట్ టాపిక్. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కథతో వెళితేనే బెటర్ అని పూరి డిసైడ్ అయ్యాడట. మొత్తానికి బర్నింగ్ టాపిక్ ని పట్టుకుని సరైన హీరోతో పాన్ ఇండియా రేంజులో వర్కవుట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల పూరీని కలిసి నమ్రత స్క్రిప్టు గురించి అడిగారని వార్తలొచ్చాయి. అంటే ఇంకా మహేష్ తో పూరి సినిమా హోప్ ఉందనే భావించాల్సి ఉంటుంది. కాస్త ఆగితే కానీ ఏదీ క్లారిటీ రాదు.