Begin typing your search above and press return to search.

జ‌న‌‌గ‌న‌మ‌న‌.. మ‌హేష్ తోనేనా..?

By:  Tupaki Desk   |   23 Jun 2020 11:45 AM IST
జ‌న‌‌గ‌న‌మ‌న‌.. మ‌హేష్ తోనేనా..?
X
జ‌న‌గ‌న‌మ‌న.. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. చాలా కాలంగా ఈ సినిమా పెండింగ్ లో ప‌డిపోయింది. ఏ ముహూర్తాన జ‌గ‌గ‌న‌మ‌న స్క్రిప్టు రాసాడో కానీ అత‌డికి ఏదీ క‌లిసి రాలేదు. వ‌రుస‌గా ప‌లు చిత్రాలు డిజాస్ట‌ర్లు అవ్వ‌డంతో టైమ్ బ్యాడ్ అయ్యింది. దాంతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ .. సూప‌ర్ స్టార్ మ‌హేష్ లాంటి వాళ్లు సైడైపోయారు. స‌క్సెస్ లేక మ‌హేష్ నాతో చేయ‌న‌న్నారు! అన్న ఆవేద‌న‌ను పూరి వ్య‌క్తం చేయ‌డం అనంత‌ర ఎపిసోడ్ల గురించి తెలిసిందే. అయితే ఇటీవ‌లే పూరీతో సినిమా చేసేందుకు మ‌హేష్ సుముఖంగా ఉన్నార‌ని న‌మ్ర‌త అందుకు లైన్ క్లియ‌ర్ చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది.

అనంత‌ర కాలంలోనూ `జ‌న‌‌గ‌న‌మ‌న` మ‌రోసారి తెర‌పైకొచ్చింది. ఇప్ప‌టికీ ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు పూరి చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఎందుకంటే అది అత‌డి డ్రీమ్ ప్రాజెక్ట్. అది అత‌డు నిరంత‌రం క‌ల‌గ‌నే ప్రాజెక్ట్. మ‌రోసారి ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియాల్లో చెప్పారు పూరి. ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో ఇదే ఊపులో బాలీవుడ్ దిగ్గ‌జం క‌ర‌ణ్ జోహార్ తో చేతులు కలిపి రౌడీ దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ అనే పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేశారు. అనంత‌రం అత‌డు మ‌రో పాన్ ఇండియాకి ప్లాన్ చేస్తున్నార‌న్న‌ది హాట్ టాపిక్ గా మారింది.

``జ‌న‌గ‌న‌మ‌న నా డ్రీమ్ ప్రాజెక్ట్‌. నేను త‌ప్ప‌కుండా ఈ సినిమా చేస్తాను. అంతేకాదు.. పాన్ ఇండియా క‌థాంశ‌మిది`` అని పూరి త‌న ఆస‌క్తిని మ‌రోసారి సోష‌ల్ మీడియాల్లో వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లోనే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంద‌ని పూరి వెల్ల‌డించారు. పూరి క‌నెక్ట్స్ లోనే టై అప్ ల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతుంద‌ని తెలిపాడు. అయితే పూరి క‌ల‌లు గ‌న్న ఈ ప్రాజెక్టు ఎవ‌రితో ముందుకు వెళుతుంది? అన్న‌ది మాత్రం ఇంకా స‌స్పెన్స్. అయితే మ‌హేష్ లేక‌పోతే ప‌వ‌న్ తో ఛాన్సుంటుందేమో!!