Begin typing your search above and press return to search.

లైగ‌ర్ ఎడిటింగ్ లో కూల్ గా చిల్ అవుతున్న పూరి

By:  Tupaki Desk   |   9 April 2021 6:00 AM IST
లైగ‌ర్ ఎడిటింగ్ లో కూల్ గా చిల్ అవుతున్న పూరి
X
`రౌడీ వేర్` బ్రాండ్ పాపులారిటీ గురించి తెలిసిన‌దే. విజ‌య్ దేవ‌రకొండ సొంత వ‌స్త్ర శ్రేణి నేమ్ ఇది. అప్పుడ‌ప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి దేవ‌రకొండ స్పెష‌ల్ స్పోర్ట్స్ దుస్తుల్ని రౌడీ బ్రాండ్ వి పంపించి స్టైలిష్ అభిమానుల్లో క్రెడిట్ కొట్టేస్తుంటాడు.

ఈసారి పూరి జ‌గ‌న్నాథ్ కి కానుక‌లు పంపిన‌ట్టున్నాడు. రౌడీ వేర్ బ్రాండ్ టీష‌ర్ట్.. ట్రాక్ తొడుక్కుని కూల్ గా ఎడిటింగ్ ల్యాబ్ లో కూచుని ఫోజిచ్చాడిలా. ఆ టీష‌ర్ట్ పై రౌడీ అన్న ప్రింట్ స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. పూరి ఎంతో కూల్ గా చిల్లింగ్ గా స్మైలిస్తూ క‌నిపిస్తున్నారు.``ది రౌడీ క్ల‌బ్ కూల్ స‌మ్మ‌ర్ వేర్ లో కూల్ గా ఎంజాయ్ చేస్తున్నా.. లైగ‌ర్ ఎడిటింగులో ఉన్నాను`` అని పూరి తెలిపారు. త‌న‌ని స‌మ్మ‌ర్ లో కూల్ గా ఉంచిన రౌడీ వేర్ ఇచ్చినందుకు దేవ‌ర‌కొండ‌కు కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలిపారు.

ఇక పూరి - విజ‌య్ కాంబినేష‌న్ మూవీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదుర‌వుతూనే ఉంది. క‌రోనా క్రైసిస్ వ‌రుస లాక్ డౌన్ లు తెలిసిన‌దే. ఇప్పుడు ముంబై స‌హా మ‌హారాష్ట్ర‌లో సెకండ్ వేవ్ ప్ర‌భావంతో లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో లైగ‌ర్ షూట్ ప్లేస్ నే మార్చేస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ముంబై బ‌దులుగా హైద‌రాబాద్ లోనే లైగ‌ర్ చిత్రీక‌ర‌ణ సాగ‌నుంద‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ కి వ‌చ్చేశాక‌ ఇలా కూల్ గా ఎడిటింగ్ ప‌నుల్లోకి చేరారు పూరి.