Begin typing your search above and press return to search.

పూరి 'జ‌న‌గ‌ణ‌మ‌న' అధికారికం.. హీరో ఎవ‌రో?

By:  Tupaki Desk   |   7 Feb 2022 3:28 AM GMT
పూరి జ‌న‌గ‌ణ‌మ‌న అధికారికం.. హీరో ఎవ‌రో?
X
చాలా కాలంగా పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌న‌మ‌న పెండింగ్ లో ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో జ‌న‌గ‌న‌మ‌న తెర‌కెక్కిస్తున్నాన‌ని పూరి తెలిపారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుక‌నో టేకాఫ్ కాలేదు. ఇదే క‌థాంశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా న‌టిస్తార‌ని టాక్ వినిపించింది. కానీ అది కూడా సాధ్య‌ప‌డ‌లేదు.

ఇప్పుడు మ‌రోసారి పూరి సైలెంట్ గా జ‌న‌గ‌న‌మ‌న ను అధికారికంగా ప్ర‌క‌టించారు. లైగ‌ర్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన సంద‌ర్భంగా అత‌డి న‌ర్మ‌గ‌ర్భ ప్ర‌క‌ట‌న క్యూరియాసిటీని పెంచింది. ఇప్పుడు జ‌న‌గ‌న‌మ‌న ఎవ‌రితో తెర‌కెక్కిస్తున్నారు? అన్న‌దానికి స‌మాధానం క్లారిటీగా ఉంది.

విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేష‌న్ లో లైగర్ పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక‌కుతున్న‌ సంగ‌తి తెలిసిందే. అనన్య పాండే ఈ సినిమాలో కథానాయిక. టాకీ పార్ట్ ని ఇటీవ‌ల‌ పూర్తి చేసారు. ఇంత‌లోనే దీనికి సంబంధించిన అధికారిక అప్ డేట్ ఇచ్చారు పూరి. దాంతో పాటే `జనగణమన` అంటూ న‌ర్మ‌గ‌ర్భ ప్ర‌క‌ట‌నతో పూరి ట్విస్టిచ్చారు. పూరి క‌నెక్ట్స్ అధినేత్రి... చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి కౌర్ ట్విట్టర్ లో అప్ డేట్ ను పంచుకున్నారు. ఆమె ట్విటర్ లో పూరీ జగన్ వాయిస్ నోట్ ను పంచుకున్నారు. అందులో జగన్ ``మేము ఈరోజుతో లైగర్ షూటింగ్ ను ముగించాము.. ఈ రోజు నుండి జనగణమన`` అని అన్నారు. అంతేకాదు హ్యాష్ దేవ‌ర‌కొండ అంటూ ఈ ప్ర‌క‌ట‌న‌లో క్లారిటీగా వెల్ల‌డించారు.

ఛార్మి అధికారిక ప్ర‌క‌ట‌న‌లో ఇలా ఉంది..#LIGER

#JGM @TheDeverakonda #purijagannadh .. దీన‌ర్థం .. దేవ‌ర‌కొండ‌తో ఖాయ‌మైన‌ట్టేన‌ని.. అంటే జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రాన్ని మ‌హేష్ తో కానీ ప‌వ‌న్ తో కానీ పూరి చేయడం లేదు. లైగ‌ర్ పూర్త‌యిన వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే జ‌న‌గ‌ణ‌మ‌న ను ప్రారంభించేస్తున్నాడ‌ని ఖాయ‌మైంది. దేశ‌భ‌క్తి కాన్సెప్ట్ తో పూరి ఐడియాల‌జీని ప్ర‌తిబింబించే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.