Begin typing your search above and press return to search.

స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్...?

By:  Tupaki Desk   |   17 Jun 2020 3:17 AM GMT
స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్...?
X
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గతేడాది 'ఇస్మార్ట్ శంక‌ర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడు. ఈ జోష్ లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో 'ఫైటర్' అనే సినిమా స్టార్ట్ చేసాడు పూరీ. ముంబై బ్యాక్‌ డ్రాప్‌ లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరీ - ఛార్మి - కరణ్‌ జోహార్‌ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ మధ్య ప్రభుత్వాలు షూటింగ్స్ చేసుకునేందుకు అనుమతి ఇస్తుండటంతో.. ఆగిపోయిన తమ సినిమాలను సెట్స్ మీదకు తెచ్చేలా అడుగులేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ తన 'ఫైటర్' సినిమాపై ఫోకస్ పెట్టారట.

ముంబైలో 40 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా స్టోరీలో ముందుగా రాసుకున్న ప్రకారం విజయ్ దేవరకొండ విదేశీ ఫైటర్స్‌‌ తో ఫైటింగ్‌ చేసే కొన్ని సీన్స్‌ ఉన్నాయట. అయితే ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యపడదని భావించి లోకల్ ఫైటర్స్‌‌ తో ఈ ఫైటింగ్ సీన్స్ తెరకెక్కించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిందట. దీంతో ఈ మేరకు పూరీ స్క్రిప్ట్‌‌ లో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. ఇక పూరీ సినిమా అంటేనే బ్యాంకాక్ బీచ్ లలో సాంగ్స్, సీన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అవన్నీ ఉండకపోవచ్చు. అంతేకాకుండా పూరి కొంత భాగం విదేశాల్లో కూడా షూట్ చేయాలని భావించాడట. అయితే పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుని పూర్తిగా హైదరాబాద్ లోనే షూట్ చేసేలా లొకేషన్స్ వేట ప్రారంభించాడట. దీంతో 'ఫైటర్' మూవీ విడుదల ఈ ఏడాది కష్టమే అని.. వచ్చే ఏడాది ప్రారంభంలో రావొచ్చని అనుకుంటున్నారు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రం అమ్మ సెంటిమెంట్ తో పాటు కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఇటీవల వరుస ప్లాపులను ఎదుర్కుంటున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై పూరీ జగన్నాథ్ పై భారీ ఆశలే పెట్టుకుని ఉన్నాడు. మరి విజయ్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో చూడాలి.