Begin typing your search above and press return to search.

పూరి 'రొమాంటిక్‌' పార్టీ ఇచ్చాడట

By:  Tupaki Desk   |   7 Nov 2021 2:30 AM GMT
పూరి రొమాంటిక్‌ పార్టీ ఇచ్చాడట
X
డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ పార్టీలకు పబ్ లకు కొత్తేం కాదు. రెగ్యులర్ గా ఆయన పార్టీలు ఇస్తూనే ఉంటాడు.. వెళ్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి ఆయన మరో పార్టీ ఇచ్చాడు. అయితే ఈసారి ఆయన పార్టీ చాలా స్పెషల్‌ అంటున్నారు. ఆయన కొడుకు సక్సెస్‌ ను సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం పూరి ఈసారి పార్టీ ఇచ్చాడు. ఆకాష్‌ హీరోగా నటించిన రొమాంటిక్‌ సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. సినిమాకు వచ్చిన బజ్‌ నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. భారీ అంచనాల నడము విడుదల అయిన రొమాంటిక్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆకాష్ పూరి నటనకు మంచి మార్కులు పడటంతో పాటు కొన్ని సన్నివేశాల్లో పూరి స్టైల్‌ ఆఫ్‌ స్క్రీన్‌ ప్లే బాగుందనే టాక్ వచ్చింది.

రొమాంటిక్ సినిమాను ఛార్మితో కలిసి పూరి స్వయంగా నిర్మించాడు. సినిమా కు మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉన్నంతలో కాస్త బాగనే నిర్మించాడు. సినిమాకు వచ్చిన బజ్‌ నేపథ్యంలో విడుదలకు ముందే పూరికి లాభాలను తెచ్చి పెట్టిందట. సినిమా థియేట్రికల్‌ రైట్స్ మరియు ఇతర రైట్స్ ద్వారా లాభాలు రావడం మాత్రమే కాకుండా ఆకాష్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో పూరి చాలా హ్యాపీగా ఉన్నాడట. అందుకే ఈ సినిమా సక్సెస్‌ ను సెలబ్రేట్‌ చేసుకోవాలని పూరి భావించాడు. అందుకే రొమాంటిక్ చిత్ర యూనిట్‌ సభ్యులు అందరికి కూడా మంచి పార్టీ ఇచ్చాడట. ఇంతకు ముందే రొమాంటిక్ టీమ్‌ ను ట్రిప్ కు పంపించాడు అనే టాక్ వచ్చింది.

ఆకాష్ కు మొదటి సక్సెస్ దక్కిన నేపథ్యంలో తదుపరి సినిమా లు ఒక మోస్తరుగా ఆడటం ఖాయం అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక పూరి జగన్నాద్‌ ప్రస్తుతం లైగర్ సినిమాను చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ అనన్య పాండే హీరోయిన్ గా రూపొందుతున్న లైగర్ సినిమా లో రియల్‌ స్టార్‌ మైక్ టైసన్ కూడా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు మరియు ఇతర భాషల్లో ఈ సినిమాను వచ్చే సమ్మర్ లో విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.