Begin typing your search above and press return to search.

పూరి ఛాన్స్ ఇచ్చాడు .. ఒక ఆర్టిస్ట్ వెన్నుపోటు పొడిచాడు!

By:  Tupaki Desk   |   12 Dec 2021 9:00 AM IST
పూరి ఛాన్స్ ఇచ్చాడు .. ఒక ఆర్టిస్ట్ వెన్నుపోటు పొడిచాడు!
X
దర్శకుడిగా పూరి జగన్నాథ్ ఎంతోమంది ఆర్టిస్టులను తెలుగు తెరకి పరిచయం చేస్తూ వచ్చారు. అలా పూరి కాంపౌండ్ నుంచి వచ్చిన నటులలో ఆనంద్ భారతి ఒకరు. విలన్ కి ముఖ్యమైన అనుచరుడిగా .. విలన్ గ్యాంగ్ లో ఒకరిగా ఆయన ఎక్కువగా కనిపిస్తూ వచ్చాడు.

22 ఏళ్లుగా ఆయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇప్పటికి 200 సినిమాలకిపైగా నటించిన ఆయన, సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు.

"ఒక ఆర్టిస్ట్ గా నాకు గుర్తింపు వచ్చేలా చేసింది పూరి జగన్నాథ్ గారు .. ఆయనకి నన్ను సిఫార్స్ చేసింది పవన్ కల్యాణ్ గారు. సినిమాల్లోకి రావడానికి ముందు నేను మోడలింగ్ చేసేవాడిని. సినిమాల్లోకి వెళదామని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను.

అలాంటి సమయంలోనే ఒక చోట 'తమ్ముడు' షూటింగు జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లాను. అక్కడికి వెళ్లినందుకు ఒక చిన్న ఛాన్స్ ఇచ్చారు. మోడల్ గానే ఆ సినిమాలో కనిపించాను. ఆ తరువాత పవన్ గారు ఒక్కరే ఉన్నప్పుడు వెళ్లి నా గురించి ఆయనకి చెప్పాను.

ఆ తరువాత పవన్ కల్యాణ్ గారు నన్ను పూరి గారికి సిఫార్స్ చేశారు. ఆయన వరుస సినిమాలలో నాకు అవకాశం ఇచ్చారు. 'ఇడియట్' చేసిన తరువాత 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'లో నాకు మెయిన్ విలన్ వేషం ఇచ్చారు.

ఆ తరువాత సుబ్బరాజు ఎంటరై నాకు వెన్నుపోటు పొడిచాడు. ఏదో జరిగింది .. దాంతో నన్ను పక్కన పెట్టి అతణ్ణి తీసుకోవడం జరిగింది. ఆయన ఎలాంటి గేమ్ ప్లే చేశాడో నాకు తెలియదు .. మొత్తానికైతే ఏదో చేశాడు. అందువల్లనే లాస్ట్ మినిట్ లో నన్ను తీసేయడం .. ఆయనని పెట్టుకోవడం జరిగింది. అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను.

ఏమీ అనుకోకు మళ్లీ చేద్దాంలే అని పూరి అన్నారు .. 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పటికీ ఆ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పటికీ టీవీలో ఆ సినిమా వస్తుంటే వదలకుండా చూస్తారు. ఆ వ్యక్తి కారణంగా నాకు ఒక గోల్డెన్ ఛాన్స్ పోయింది. ఒక స్నేహితుడిగా నాతో ఉంటూనే నన్ను మోసం చేశాడు.

ఎందుకు ఇలా చేశావని నేను ఆయనను అడగలేదు. ఆయన ఇలా చేశాడని పూరి గారు కూడా నాతో ఏమీ చెప్పలేదు. ఆయన ఏం చేశాడనేది ఇప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఆ తరువాత పూరిగారితో సినిమాలు చేశానుగానీ .. ఆ సినిమాలోలాంటి రోల్ మాత్రం రాలేదు" అని చెప్పుకొచ్చాడు.