Begin typing your search above and press return to search.

పోకిరి: అసలు హీరోయిన్ ఇలియానా కాదట!

By:  Tupaki Desk   |   11 May 2020 12:30 PM IST
పోకిరి: అసలు హీరోయిన్ ఇలియానా కాదట!
X
ఒక సినిమా ప్లానింగ్ దశలో చాలనే అనుకుంటారు కానీ అవన్నీ జరగవు. ఎగ్జిక్యూషన్ దశలోకి వచ్చేసరికి అంతా మారిపోతుంది. ఒక్కోసారి మొదట అనుకున్న హీరో కూడా ఉండడు. దీంతో మరో హీరోతో సినిమాను తెరకెక్కించాలసి ఉంటుంది. హీరోయిన్ల ఎంపిక కూడా అంతే. మహేష్ బాబు - పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పోకిరి' ఎలాంటి హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇలియనా ఒక్కసారి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నిజానికి ఈ సినిమాకు మొదట అనుకున్న హీరోయిన్ ఇలియానా కాదట.

ఈ విషయం ఎవరికైనా సర్ ప్రైజ్ అనిపిస్తుంది కానీ ఇదే నిజమట. 'పోకిరి' సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో నిజానికి ఇద్దరు హీరోయిన్లను తీసుకుందామని పూరి అనుకున్నారట. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే ఒకరు దీపిక పదుకొనె.. మరొకరు పార్వతి మెల్టన్. ఈ ఇద్దరిలో దీపిక పేరును పూరి సజెస్ట్ చేశారట.. పార్వతి మెల్టన్ పేరును మహేష్ రిఫర్ చేశారట. అయితే ఆ సమయంలో మహేష్ ఎందుకో దీపిక పట్ల ఆసక్తి చూపించలేదట. ఇక పూరికి పార్వతి ఛాయిస్ నచ్చలేదట. దీంతో ఈ ఇద్దరిని పక్కన పెట్టి పూరి.. మహేష్ ఓ అంగీకారానికి వచ్చి సినిమాకు ఒకరే హీరోయిన్ అని ఫిక్స్ అయ్యారట.. ఇలియానాను ఫైనలైజ్ చేశారట.

ఏదేమైనా ఇలియానా కెరీర్లో ఈ సినిమా ఓ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు.. తనను టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. 'పోకిరి' విజయం తర్వాత ఇలియానా ఇక వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు.