Begin typing your search above and press return to search.

ఆడియోతో చాలామందిని కనెక్ట్ చేశారు

By:  Tupaki Desk   |   14 March 2017 4:14 AM GMT
ఆడియోతో చాలామందిని కనెక్ట్ చేశారు
X
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ రోగ్. ఇషాన్ హీరోగా తెలుగు.. కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం.. తెలుగు వెర్షన్ ఆడియో ఫంక్షన్ ను నిన్న హైద్రాబాద్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. సన్నీ లియోన్ చేసిన స్పెషల్ డ్యాన్సులు.. ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరోవైపు రోగ్ ఆడియో వేడుకను తన ఏజెన్సీకి పబ్లిసిటీ కోసం కూడా పూరీ జగన్నాధ్ ఉపయోగించుకున్నాడు. పూరీ కనెక్ట్స్ అంటూ మోడల్స్ ను ఇండస్ట్రీకి దగ్గర చేసే ఏజన్సీ ఒకటి ఉంది ఈ దర్శకుడికి. ఇందులో ఛార్మి కూడా మహా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు రోగ్ వేడుక సాక్షిగా.. తమ ఏజన్సీలోని అందాల భామలను పరిచయం చేశాడు. గ్లామర్ తో హంగామా చేశాడు పూరీ. ఏంజెలా.. కైరా దత్.. అంకితా శ్రీవాస్తవ.. సంజనా.. కాశిష్ వోహ్రా.. మన్నారా చోప్రా.. ఐశ్వర్యా దేవన్ లు ఒలికించిన గ్లామర్.. రోగ్ ఆడియో వేడుకకు వచ్చిన వారికి స్పెషల్ బోనస్ గా మారింది.

వీళ్లలో కొంతమంది ఇప్పటికే అందరికీ తెలిసిన భామలు కాగా.. మరికొందరు కొత్త సుందరాంగులు. అటు తన సినిమా ప్రచారానికి గ్లామర్ కురిపించేందుకు.. ఇటు వాళ్లకు ఓ అడ్వర్టెయిజ్మెంట్ లా ఉపయోగపడేలా ఈ వెన్యూను భలేగా ఉపయోగించుకున్నాడు పూరీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/