Begin typing your search above and press return to search.

క‌రోనాతో మ‌రో సింగ‌ర్ మృతి.. ఇండ‌స్ట్రీలో విషాదం!

By:  Tupaki Desk   |   24 Feb 2021 5:00 PM IST
క‌రోనాతో మ‌రో సింగ‌ర్ మృతి.. ఇండ‌స్ట్రీలో విషాదం!
X
క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు శార్దుల్‌ సికందర్‌ కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవ‌త్స‌రాలు. ఈ మ‌ధ్య క‌రోనా బారిన ప‌డిన శార్దుల్‌.. పాజిటివ్ అని తేలిన‌నాటి నుంచి చికిత్స పొందుతున్నారు. మొహాలీలోని ఫోర్టిస్‌ ఆసుపత్రిలో ఆయ‌న అడ్మిట్ అయ్యారు. అయితే.. కరోనాతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్ర‌మ‌వ‌డంతో ప‌రిస్థితి విష‌మించి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు‌.

శార్దూల్ మరణం ప‌ట్ల పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ సంతాపం తెలిపారు. ఈ మేర‌కు ట్విట‌ర్ లో పోస్టు చేశారు. శార్దూల్ మృతిప‌ట్ల కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు అమ‌రీంద‌ర్‌. పంజాబ్ వాసులు గొప్ప గాయ‌కుడిని, న‌టుడిని కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. శార్దూల్‌ మ‌ర‌ణం పంజాబీ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని అన్నారు.

ముఖ్య‌మంత్రితోపాటు శిరోమ‌ణి అకాలీద‌ళ్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్, ఇతర సినీ, రాజ‌కీయ‌ ప్రముఖులు శార్దుల్‌ మృతిప‌ట్ల సంతాపం వ్య‌క్తంచేశారు. కాగా.. పంజాబీ ఫోక్ సింగర్ గా, పాప్ సింగ‌ర్ గా శార్దూల్ సికిందర్ ఎంతో ఖ్యాతి గ‌డించారు. 1980లో ఆయ‌న ‘రోడ్‌వేస్ ది లారీ’ పేరిట‌ మొద‌టి ఆల్బ‌మ్‌ను విడుద‌ల చేశారు. ఈ ఆల్బమ్ ఆయనకు ఎంతో పాపులారిటీ తీసుకొచ్చింది.

ఆ త‌ర్వాత శార్దూల్ కెరీర్ అద్భుతంగా ముందుకు సాగింది. పంజాబీ సినిమాలకు ఎన్నెన్నో హిట్ సాంగ్స్ అందించారు. ఇక, శార్దూల్ గొప్ప గాయకుడు మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. ఆ న‌ట‌న‌కు ఎంతో గుర్తింపు వ‌చ్చింది. ‘జ‌గ్గా ద‌కురా’ అనే మూవీలో శార్దూల్ న‌ట‌న ఎంతగానో అలరించింది.