Begin typing your search above and press return to search.

'డ‌ర్టీ హ‌రి' ఈ బ్యూటీ రూటు మారుస్తుందా..?

By:  Tupaki Desk   |   12 Dec 2020 5:32 PM IST
డ‌ర్టీ హ‌రి ఈ బ్యూటీ రూటు మారుస్తుందా..?
X
'ప్రేమతో మీ కార్తీక్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది పంజాబీ బ్యూటీ సిమ్రత్ కౌర్. ఈ సినిమా ప్లాప్ అవడంతో అమ్మడు ఎవరికీ గుర్తు లేదు. ఆ తర్వాత 'పరిచయం' 'సోనీ' అనే రెండు సినిమాల్లో నటించినా సిమ్రత్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఎమ్ ఎస్ రాజు దర్శ‌క‌త్వం వ‌హించిన 'డ‌ర్టీ హ‌రి' సినిమాతో అందరి దృష్టి పడేలా చేసుకుంది. ఫుల్ లెన్త్ గ్లామ‌ర్ రోల్ చేసిన సిమ్రత్ రెచ్చిపోయి నటించేసిందని తెలుస్తోంది. డర్టీ హరి సినిమాలో ఈ బ్యూటీ బోల్డ్ సీన్స్ చేయ‌డానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. అలానే ఈ సినిమా ట్రైల‌ర్స్ కాస్తా వైర‌ల్ అవుతుండ‌టంతో సినిమా రిలీజ్ కాకముందే ఈ బ్యూటీ మీద అంద‌రి ఫోక‌స్ ప‌డింది.

వాస్త‌వానికి సిమ్రత్ కౌర్ ని 'గీత‌గోవిందం' సినిమాలో తీసుకోవాలని అనుకున్నారట. అయితే చివరకు ఆ ఛాన్స్ ర‌ష్మిక మందన్నా కొట్టేసింది. అయితే ఇప్పుడు యాధృచికంగా 'డ‌ర్టీ హ‌రి'ని రిలీజ్ చేస్తున్న ఫ్రైడే మూవీస్ యాప్ లో 'గీత‌గోవిందం' నిర్మాత బ‌న్నీవాసు కూడా ఉన్నాడని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాను కొనాల‌ని ఆ యాప్ వారికి బన్నీ వాసు సూచించ‌న‌ట్లుగా సినీ వర్గాల్లో టాక్ ఉంది. నేటి యువతను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ లో శ్రవణ్‌రెడ్డి - రుహానీ శర్మలతో కలిసి నటిస్తోంది సిమ్రత్‌ కౌర్‌. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. అందాల గేట్లు తెరిచిన సిమ్రత్ కౌర్ రూట్ డర్టీ హరి మారుస్తుందేమో చూడాలి.