Begin typing your search above and press return to search.

శిరీష్.. బెంగుళూరు కథ ఏంటమ్మా?

By:  Tupaki Desk   |   14 Nov 2017 5:12 AM GMT
శిరీష్.. బెంగుళూరు కథ ఏంటమ్మా?
X
టాలీవుడ్ లో అల్లు వారి రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. మెగా సైడ్ క్రేజ్ ఉన్నా కూడా వారికంటూ ఓ గుర్తింపును దక్కించుకున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తన టాలెంట్ తో స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణను దక్కించుకుంటున్నాడు. ఇకపోతే అల్లు శిరీష్ కూడా ఇంకా టాలీవుడ్ లో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

ఈ హిట్టు సంగతి పక్కనబెడితే మనోడు కన్నడ సైడ్ హీరోలతో రిలేషన్ ని చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ మధ్య అక్కడి హీరోలను చాలా కలుసుకుంటున్నాడు. అంతే కాకుండా వారు నిర్వహించే వేడుకలకు కూడా తరచు వెళుతున్నాడు. కొన్ని రోజుల క్రితం శివ రాజ్ కుమార్ టగరు సినిమా ట్రైలర్ లాంచ్ కి కూడా వెళ్లాడు. అంతే కాకుండా అక్కడి యువ హీరోలు సంయుక్త హోర్నాడ్ అండ్ శృతి హరిహరన్ తో కూడా టచ్ లో ఉంటున్నాడు. పార్టీలు కూడా చేసుకుంటున్నాడు. ఇకపోతే శిరీష్ ప్రస్తుతం విఐ.ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం బెంగుళూరులోని శోభా అపార్ట్మెంట్స్ లో జరుగుతోంది. అయితే ఈ సారి ఏకంగా షూటింగ్ స్పాట్ కి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే శాండిల్ వూడ్ మార్కెట్ పై కుర్ర హీరో కన్నేశాడా ఏంటి? అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి

లేకపోతే ప్రస్తుతం చేస్తోన్న సినిమా అక్కడ రిలీజ్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయినా గీత ఆర్ట్స్ తలచుకుంటే అది చాలా ఈజీ. మరి శిరీష్ కి ఈ క్లోజ్ రిలేషన్స్ ఏమిటో.. అసలు బెంగుళూరులో ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!