Begin typing your search above and press return to search.

బిగ్ బాస్‌ పై మళ్లీ నోరు పారేసుకుంది

By:  Tupaki Desk   |   19 Dec 2020 1:30 AM GMT
బిగ్ బాస్‌ పై మళ్లీ నోరు పారేసుకుంది
X
బిగ్‌ బాస్ సీజన్‌ 3 లో రాహుల్‌ సిప్లిగంజ్‌ మరియు పునర్నవిల జోడీ ప్రేక్షకులను అలరించింది. వీరిద్దరి కాంబోతో గత సీజన్‌ కు మంచి రేటింగ్‌ వచ్చింది అనడంలో సందేహం లేదు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 విజేతగా రాహుల్ నిలవడంలో పున్ను పాత్ర చాలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా ఆపర్లు తెచ్చుకోలేదు. ఈమెను జనాలు పెద్దగా గుర్తించలేదు. కాని ఎప్పుడైతే బిగ్‌ బాస్‌ ఆమె పాల్గొన్నదో అప్పటి నుండే ఆమె ను అంతా గుర్తించడం మొదలు పెట్టారు. కాని పునర్నవి మాత్రం బిగ్‌ బాస్‌ కు వెళ్లి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ గతంలో వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల మరోసారి బిగ్‌ బాస్ గురించి ఆమె మాట్లాడుతూ తనకు బిగ్‌ బాస్‌ ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదని పేర్కొంది. నేను బిగ్‌ బాస్ లో పాల్గొనడం వల్ల గొప్పగా మార్పు ఏమీ రాలేదని పేర్కొంది. కాని నెటిజన్స్‌ మాత్రం బిగ్‌ బాస్ లో ఆమె పాల్గొనకుంటే ఇప్పటికే ఆమెను జనాలు పూర్తిగా మర్చిపోయే వారు. కాని ఇప్పుడు ఆమెకు సోషల్‌ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ మరియు వెబ్‌ సిరీస్ ల్లో ఆఫర్‌ కు కారణం ఖచ్చితంగా బిగ్‌ బాస్‌ అంటున్నారు. ఆ విషయాన్ని మర్చి పోయి పునర్నవి బిగ్ బాస్ ను మళ్లీ మళ్లీ విమర్శిస్తుంది అంటూ నెటిజన్స్‌ ఆరోపిస్తున్నారు.