Begin typing your search above and press return to search.

తెలుగు పిల్లను 'హిట్టు' గోడ దూకించండయ్యా

By:  Tupaki Desk   |   28 Nov 2016 5:30 PM GMT
తెలుగు పిల్లను హిట్టు గోడ దూకించండయ్యా
X
ఇప్పటివరకు చాలామంది తెలుగు అమ్మాయి హీరోయిన్లుగా వచ్చారుకాని.. వారిలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ అయినవారు చాలా తక్కువే. స్వాతి.. అంజలి.. వీరెవ్వరూ కూడా స్టార్ హీరోయిన్లుగా చలమాణి కాలేకపోయారు. ఇప్పుడైతే అసలు కనీసం చిన్న చిన్న సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలే కనిపించట్లేదు. హెబ్బా పటేల్స్.. నందితా శ్వేతాస్.. నివేదా థామస్స్.. దన్యా బాలకృష్ణన్స్.. అందరూ వేరే భాషల వారే.

నిజానికి ఉయ్యాల జంపాల సినిమా వచ్చినప్పుడు.. ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన పునర్నవి భూపాళం ఇక దూసుకుపోతుంది అనుకున్నారు. కాని ఈ అమ్మడు మాత్రం ఓ రెండు మూడు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో మెరవడం తప్పించి.. అసలు హీరోయిన్ గా ఛాన్సులే పట్టలేకపోయింది. కట్ చేస్తే ఇప్పుడు డెబ్యూ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసరే ''పిట్టగోడ'' సినిమాతో ఈమెను హీరోయిన్ చేసేశారు. మాంచి అందగత్తె కావడం.. పెర్ఫామెన్స్ లో కూడా టాలెంట్ ఉండటం.. చక్కటి సొంత గాత్రం.. ఈమె ప్లస్ పాయింట్లే. కాకపోతే సినిమా హిట్టయితేనే బ్రేక్ వస్తుంది.

మరి నూతన దర్శకుడు తీస్తున్న ఈ పిట్టగోడ పునర్నవిని ఒక హిట్టు గోడ దూకిస్తుందా? అలా దూకితేనే అమ్మడు ఇక్కడ హీరోయిన్ గా స్థిరపడేది. లేకపోతే మాత్రం కష్టమే. దొరక్కదొరక్క ఒక తెలుగమ్మాయి దొరికింది.. ఏదో ఒకటి చేయండి గురూ!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/