Begin typing your search above and press return to search.

హీరోయిన్ కిడ్నాప్ కేసు.. హీరో కక్కలేక మింగలేక

By:  Tupaki Desk   |   5 July 2017 9:43 AM GMT
హీరోయిన్ కిడ్నాప్ కేసు.. హీరో కక్కలేక మింగలేక
X
సంచలనం సృష్టించిన మలయాళ హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి రోజుకో ఆసక్తికర అప్ డేట్ బయటికి వస్తోంది. ఆ హీరోయిన్ కిడ్నాప్ వెనుక సూత్రధారి అయి ఉంటాడని సీనియర్ హీరో దిలీప్ మీద ముందు నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. బయటికి వస్తున్న పరిణామాలు చూస్తుంటే.. ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి.

ఈ కేసుకు సంబంధించి మీ పేరు బయటికి రాకుండా ఉండాలంటే కోటిన్నర రూపాయలు ఇవ్వాలంటూ దిలీప్ ను కిడ్నాప్ కేసు ప్రధాన నిందితుడు పల్సర్ సునికి సన్నిహితుడైన ఓ వ్యక్తి డిమాండ్ చేయం.. దానికి సంబంధించిన ఆడియో క్లిప్ హల్ చల్ చేస్తుండటం తెలిసిన సంగతే. దీంతో దిలీప్ ప్రమేయంపై అందరికీ ఓ అంచనా వచ్చేసింది. మరోవైపు దిలీప్ ఈ మధ్యే పెళ్లాడిన కావ్య మాధవన్ కు చెందిన ఓ షాపులో పోలీసులు సోదాలు నిర్వహించడం.. అక్కడ బాధితురాలైన హీరోయిన్ కు సంబంధించిన ఫొటోలు వీడియోలున్న ఓ మెమొరీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు రావడం తెలిసిందే.

దీనికి తోడు పల్సర్ సుని.. దిలీప్ తో కలిసి ఉన్న ఫొటోలు లీక్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దిలీప్ నటించిన ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సెట్లో పల్సర్ సుని ఉన్న ఫొటోలవి. దీన్ని బట్టి సునికి.. దిలీప్ కు సంబంధాలున్నట్లుగా రూఢి అవుతోంది. కాబట్టి హీరోయిన్ కిడ్నాప్ వెనుక దిలీప్ ఉన్నాడన్న అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఇటీవలే కేరళ పోలీసులు దిలీప్ ను 12 గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే.