Begin typing your search above and press return to search.

జింగాలియా అంటున్న జంగిల్ బేబీ

By:  Tupaki Desk   |   24 Sep 2015 11:44 AM GMT


తెలుగు - తమిళం - హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజవుతోంది పులి. విడుదలకు మరో వారమే టైం ఉండడంతో.. ప్రమోషన్ కార్యక్రమాలు బాగా పెరిగాయి. తాజాగా ఓ మాస్ సాంగ్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది పులి యూనిట్. అవడానికి ఇది రాజుల కాలం నాటి సినిమా అయినా.. మంచి ఫోక్ బీట్ ఒకటి పెట్టేశారు. ట్రైబల్ డ్రస్సులు వేసిన హీరో - హీరోయిన్లు.. నాటు స్టెప్పుల్లో ఇరగదీశారు.

ముఖ్యంగా పక్కన విజయ్ లాంటి స్టార్ ఉన్నా.. డ్యాన్స్ - అందులోనూ మాస్ స్టెప్పులతో జిల్లుమనిపించేలా ఉంది శృతి. ఒంటి విరుపల్లోనూ - బుగ్గలు ముద్దాడ్డంలోనూ ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఐటెం సాంగ్ ని మించిపోయేలా అందాలు ప్రదర్శిస్తూ.. అంతకు మించి మత్తెక్కించే డ్యాన్సులతో ఈ అందాల భామ బాగా టెంప్టింగ్ ఉంది. ఇప్పటికే లక్కీ హ్యాండ్ అని బిరుదు సంపాదించేసిన శృతి మరో పెద్ద హిట్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది.

తాజాగా ఈమె అందాన్ని - వ్యక్తిత్వాన్ని.. అతిలోకసుందరి శ్రీదేవి కూడా బాగానే పొగిడేసింది. చూస్తుంటే.. అన్ని భాషల్లోనూ అగ్రస్థానమే టార్గెట్ గా ఉన్నట్లుంది శృతి వ్యవహారం. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్ద హిట్ అంటే.. అందులో ఖచ్చితంగా శృతి పేరు ఉంటోంది మరి.