Begin typing your search above and press return to search.

పులి మార్నింగ్ షోల్లేవు.. మ్యాట్నీలు డౌటే

By:  Tupaki Desk   |   1 Oct 2015 10:56 AM IST
పులి మార్నింగ్ షోల్లేవు.. మ్యాట్నీలు డౌటే
X
అనుకున్నదే అయింది. ‘పులి’ సినిమా మార్నింగ్ షోలు పడలేదు. మ్యాట్నీల సంగతి కూడా డౌటే అంటున్నారు. ఐతే నిన్న రాత్రి నుంచి నడుస్తున్న వివాదం సమసిపోయిందని.. ‘పులి’ రిలీజ్ కు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే అని ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో అప్ డేట్స్ వస్తున్నప్పటికీ.. సినిమా మాత్రం మార్నింగ్ షోలు పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న చర్చలు అర్ధరాత్రి తర్వాత ఓ కొలిక్కి వచ్చాయని.. ఉదయం నుంచే షోలకు ఏర్పాట్లు మొదలయ్యాయని అంటున్నారు. ముందు ఓవర్సీస్ లో.. ఆ తర్వాత ఇండియాలో షోలు పడతాయని ‘పులి’ యూనిట్ వర్గాలు తెలిపాయి. తమిళనాట ఫ్యాన్స్ కోసం తెల్లవారుజామున ఏర్పాటన్నీ షోలన్నీ క్యాన్సిల్ అయినప్పటికీ ఉదయం 9 గంటల ప్రాంతంలో షోలు మొదలైనట్లు వార్తలొచ్చాయి. అలాంటపుడు తెలుగులోనూ సినిమా మార్నింగ్ షోలతో మొదలవ్వాల్సింది.

కానీ ఇబ్బందేముందో కానీ.. ఇక్కడ షోలు పడలేదు. మధ్యాహ్నం అయినా షోలు ఉంటాయా అని థియేటర్లకు ఫోన్ చేసి అడిగితే క్లారిటీ లేదంటున్నారు. ఇంతకుముందు కమల్ హాసన్ సినిమా ‘విశ్వరూపం’ విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. ఆ సినిమా రెండో రోజు సాయంత్రానికి కానీ విడుదల కాలేదు. మరి ‘పులి’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.