Begin typing your search above and press return to search.

ఎలుక-పులి.. ఆట భలేగుంది

By:  Tupaki Desk   |   23 Jun 2015 7:30 PM GMT
ఎలుక-పులి.. ఆట భలేగుంది
X
హీరో వెంట విలన్‌, విలన్‌ వెంట హీరో పడితే దాన్ని క్యాట్‌ అండ్‌ మౌస్‌ (ఎలుక-పిల్లి) గేమ్‌ అంటాం. ఇద్దరు శత్రువులు ఒకరివెంట ఒకరు పడితే దాన్ని టామ్‌ అండ్‌ జెర్రీ గేమ్‌ అని కూడా అంటాం. సరిగ్గా ఇదే పాయింటు ఆధారంగా తమిళ దర్శకుడు హరి సింగం, సింగం 2 సినిమాలు తీసి హిట్‌ కొట్టాడు. కానీ ఇప్పుడు ఇదో డిఫరెంట్‌ ఆట.

ఆన్‌లైన్‌లో నెటిజనులు ఆడుతున్న ఈ వెరైటీ ఆట పేరు ఎలి- పులి ఆట. ర్యాట్‌ అండ్‌ టైగర్‌ గేమ్‌ అన్నమాట! తమిళంలో ఎలి అంటే ఎలక. టైగర్‌ అంటే పులి. ఎలి, పులి టైటిల్స్‌తో రెండు సినిమాలు త్వరలో రిలీజ్‌కి రాబోతున్నాయి.. కాబట్టి తమిళ మీడియా ఈ రెండు సినిమాలపై ఫన్నీ స్టోరీల్ని అల్లుకుంటోంది. అంతేకాదు సామాజిక వెబ్‌సైట్లలో అభిమానులు సైతం ఈ రెండు చిత్రాలపై రకరకాల సెటైర్లు వేస్తూ ఫన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. విజయ్‌, వడివేలు పోస్టర్లను పక్కపక్కనే అతికించి బోలెడంత కామెడీ చేస్తున్నారంతా.

ఇళయదళపతి విజయ్‌ హీరోగా చింబుదేవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పులి త్వరలోనే రిలీజ్‌కి రాబోతోంది. ఈ చిత్రంలో హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే వడివేలు హీరోగా, సదాఫ్‌ హీరోయిన్‌గా 'ఎలి' తెరకెక్కుతోంది. ఈ చిత్రం కూడా త్వరలోనే రిలీజ్‌కి రానుంది. అందుకే ఈ హంగామా అంతా.